Table of Contents
Gayatri Bhargavi Idream Swapna.. ఇది ఆమె ఆవేదన.! కాదు కాదు, అతని ఆవేదన కూడా.! సోషల్ మీడియా అంటేనే, అసహస్యం పుట్టేస్తోందిప్పుడు.!
అసహ్యమే కాదు, భయం కూడా కలుగుతోంది.! సోషల్ మీడియా అంతలా వికృత రూపం దాల్చుతోంది గత కొంతకాలంగా. ట్రోలింగ్ భూతం ఓ వైపు, ఫేక్ న్యూస్ ఇంకో వైపు.!
యాంకర్ గాయత్రి భార్గవి తెలుసు కదా.? పలు తెలుగు సినిమాల్లోనూ నటించిందీమె. ఈమె భర్త ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తి.
తోటి యాంకర్ స్వప్న తనను ఇంటర్వ్యూ చేస్తుందనగానే ఎగిరి గంతేసింది గాయత్రి భార్గవి. ‘స్వప్నక్క’ అనేంత సన్నిహిత సంబంధాలున్నాయి గాయత్రి భార్గవికి, స్వప్నతో.
Gayatri Bhargavi Idream Swapna.. యూ ట్యూబ్ ఛానళ్ళు కాదు.. బోకు ఛానళ్ళు..
కట్ చేస్తే, ఇంటర్వ్యూ అయిపోయింది.. చక్కగా వచ్చింది. అది, యూ ట్యూబ్ ఛానెల్‌లోకి వచ్చింది కూడా.
కానీ, కొన్నాళ్ళ తర్వాత, అందులోంచి ఓ వీడియో కట్ చేసి, అభ్యంతకరమైన థంబ్ నెయిల్‌తో, అత్యంత జుగుప్సాకరంగా ఆ వీడియోని పోస్ట్ చేశారు.. అదే యూ ట్యూబ్ ఛానల్‌లో.
‘నేను చచ్చిపోలేదు, బతికే వున్నాను..’ అని నిరూపించుకునేందుకు, గాయత్రి భార్గవి భర్త, ఆమెతోపాటు వీడియోలో కనిపించాల్సి వచ్చింది.
‘ఏంటి స్వప్నక్కా.. ఇది.?’ అంటూ గాయత్రి భార్గవి, ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిందంటే, స్వప్నని ఆమె ఎంతలా గౌరవించిందీ.. ఎంతలా ఆమెను నమ్మిందీ అర్థమవుతోంది.
కంటెంట్ వేరు, థంబ్ నెయిల్ వేరు.!
యూ ట్యూబ్ ఛానళ్ళలో థంబ్ నెయిల్స్‌కీ, ఆ వీడియోల్లోని కంటెంట్‌కీ అస్సలు సంబంధం వుండదు. జుగుప్సాకరం, అత్యంత జుగుప్సాకరంగా థంబ్ నెయిల్స్ క్రియేట్ చేస్తుంటారు.
Also Read: కట్టుకున్న భార్యని రోడ్డు మీదకు లాగేసిన ‘పాండిత్యం’.!
మరి, ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపేదెలా.? ‘ఎవరో ఓ వ్యక్తి చేసిన పొరపాటు మాత్రమే.. అతన్ని విధుల నుంచి తొలగించాం.. క్షమాపణ చెప్పాం’ అంటోంది, ‘ఐ-డ్రీమ్’ యాజమాన్యం.
కానీ, గాయత్రి భార్గవి అలానే ఆమె భర్త అనుభవించిన మానసిక క్షోభకి ఎవరు సమాధానం చెబుతారు.? ఉద్యోగిని తొలగించడం, క్షమాపణ చెప్పడం.. చేసిన పాపానికి ప్రాయిశ్చిత్తమా.? కానే కాదు.
తిన్నది అరగక.. అదో రోగం.!
గత కొంతకాలంగా యాంకర్ స్వప్న తీరు వివాదాస్పదంగా వుంది. ఐ-డ్రీమ్ యూ ట్యూబ్ ఛానల్ సంగతి సరే సరి.!
ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా మారి, ఆ పార్టీ కనుసన్నల్లో ఇతరులపై బురద చల్లడమే పనిగా పెట్టుకుంది ఐ-డ్రీమ్ సంస్థ.
వైసీపీ హయాంలో ఆర్థికంగా లబ్ది పొందిన ఈ ఐ-డ్రీమ్ సంస్థ ఇప్పుడిలాంటి జుగుప్సాకరమైన వ్యవహారాలకు తెరతీసిన దరిమిలా, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.