రామ్ చరణ్ ఆస్కార్.! చిరంజీవి పుత్రోత్సాహం.!

Chiranjeevi Ramcharan Oscars
Chiranjeevi Ramcharan Oscars నటుడిగా రామ్ చరణ్‌కి ఆస్కార్ పురస్కారం ఎప్పుడొస్తుంది.? ఏం, ఎందుకు రాదు.? ఏమో.! తదుపరి సినిమాతోనే అందుకుంటాడేమో కూడా.!
ఈలోగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆస్కారోత్సాహం’ పొందుతున్నారు తన కుమారుడు రామ్ చరణ్ సాధించిన ‘ఆస్కార్’ ఘనత నేపథ్యంలో.
రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ పురస్కారం లభించిన దరిమిలా, చిరంజీవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.!
Chiranjeevi Ramcharan Oscars.. రాజమౌళి మాస్టర్..
ఆస్కార్ స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్ళిన ఘనత రాజమౌళిదే. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు చిరంజీవి (Megastar Chiranjeevi).
అన్నట్టు, చిరంజీవి (Mega Star Chiranjeevi) కూడా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో నటించేశారు. అదీ ‘మగధీర’ సినిమా కోసం ఓ చిన్న సన్నివేశంలో.!
కొందరు మొరుగుతుంటారు చిరంజీవినీ, రామ్ చరణ్‌నీ ఉద్దేశించి..
సినీ రంగంలో చిరంజీవి ఎవరెస్టు శిఖరం..
కొండని చూసి కుక్కలు మొరిగితే.. ఆ కొండకేంటి నష్టం.?
ఔను, ఏనుగు రోడ్డున వెళుతుంటే గ్రామ సింహాలు మొరుగుతాయ్.. అది వాటి పిచ్చి లక్షణం.!
రామ్ చరణ్ ఎదుగుదలని చూసి ఓర్వలేనోళ్ళూ ఆ గ్రామ సింహాల్లాంటోళ్ళే..
తనంత ఎత్తుకు తన కొడుకు ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు.. తనను మించి తన కొడుకు ఎదిగితే.. ఏ తండ్రికైనా ఆ పుత్రోత్సాహం వేరే లెవల్‌లో వుంటుంది.
Mudra369
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ బెంచ్ మార్క్.! దాన్ని చరణ్ అధిగమించగలడా.? అంటే, అది వేరే చర్చ.
చిరంజీవి బెంచ్ మార్క్.. ఇంకెవరికీ సాధ్యం కాదు..
150కి పైగా సినిమాల్లో నటించడం చరణ్‌కి (Mega Power Star Ram Charan) సాధ్యమయ్యే అవకాశమే లేదు. ఈ జనరేషన్ హీరోలెవరికీ అది సాధ్యం కాదు.!
డాన్సుల్లో అయినా, చిరంజీవి (Megastar Chiranjeevi) గ్రేస్.. అది వేరే లెవల్.! ఈ జనరేషన్ హీరోలు డాన్సులు అత్యద్భుతంగా చేయొచ్చు. కానీ, డాన్సుల్లో చిరంజీవి గ్రేస్.. అదొక బెంచ్ మార్క్.!
Also Read: RRR Movie: జనం ‘ఛీ’ కొడుతున్నారు తమ్మారెడ్డీ.!
అలాంటిది, చిరంజవి తనయుడు.. ‘నాటు నాటు’ పాటతో.. మాస్ డాన్సులతో ఉర్రూతలూగించాడు. తెరపై చరణ్, ఎన్టీయార్.. చెలరేగిపోతోంటే.. చిరంజీవి సైతం ఆశ్చర్యపోయారు.. వారి డాన్సులకు ఫిదా అయిపోయారు.
ఆస్కార్.. చిరంజీవికి సైతం ఓ కల.! అలాంటిది, చిరంజీవి (Chiranjeevi) తనయుడు.. ఆ ఆస్కార్‌ని తీసుకొచ్చేశాడు. ఇంతకు మించిన పుత్రోత్సాహం ఇంకేముంటుంది.?
