Geetanjali Malli Vachindi Anjali.. దయ్యాలా మజానాకా.? అసలు దయ్యాలున్నాయా.? లేదా.? అనే సంగతి పక్కన పెడితే, సినిమాలో హారర్ సీన్లు చూపించినంత వీజీ కాదు, రియల్ లైఫ్‌లో హారర్‌ని ఫేస్ చేయడం.
శ్మశానం సన్నివేశాల్ని సినిమాల్లో సింపుల్‌గా చూపించేస్తుంటారు. కానీ, రియల్‌గా శ్మశానం వైపు చూడాలంటేనే కడుపులో గుబులు పుట్టుకొస్తుంది. అందరూ అంత ధైర్యం చేయలేరు మరి.
అలాంటిది.. ఎంత హారర్ సినిమా అయితేనేం, శ్మశానంలో టీజర్ రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టుకోవడమేంటీ.? పిచ్చి పీక్స్‌కి అంటే ఇదే మరి.
Geetanjali Malli Vachindi Anjali.. బాబోయ్.! దెయ్యమంటే మాకు భయ్యం.!
అదేనండీ.! అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా టీజర్ కోసమే మనం మాట్లాడుకుంటున్నది.
ఈ సినిమా టీజర్‌ని శనివారం.. శ్మశానం.. రాత్రి 7 గంటలు.. అంటూ రిలీజ్ డేటూ, టైమూ, శ్మశానం అడ్రస్సూ ప్రకటించి అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు చిత్ర యూనిట్.
కొంతమంది వావ్.! వాట్ ఏ ఇన్నోవేటివ్ థాట్.! క్రియేటివిటీ అదిరింది.! అంటూ కామెంట్లు చేశారు. ఇంకొందరైతే పిచ్చి పీక్స్‌కెళ్లింది.. అంటూ చిత్ర యూనిట్‌ని తిట్టి పోశారు.

మరికొందరైతే దయ్యాలతో ఆటలాడితే అంతే సంగతి.! అని కామెంట్ చేశారు. దయ్యాలకు ఆత్మ గౌరవాలూ.. అంటూ కొంతమంది ట్రోల్ చేశారు.
ఈ టీజర్ రిలీజ్‌కి గెస్ట్‌గా వచ్చేది దయ్యాలేనా.? అంటూ కొన్ని ట్రోల్స్ జరిగాయ్. సివరాఖరికి ఏం జరిగిందో ఏమో.! అంత రిస్క్ అవసరమా.? అనుకున్నారు కాబోలు.!
ఆత్మలకీ మనోభావాలుంటాయ్ భయ్యో.!
లాస్ట్ మినిట్‌లో చిత్ర యూనిట్ తమ డెసిషన్ మార్చుకుంది. తూచ్.! టీజర్ రిలీజ్ ప్లేస్ మారిందంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
దయ్యాలు, అదేనండీ ఆత్మల ఆత్మగౌరవాల్ని, మనోభావాల్ని పరగణలోకి తీసుకుని, భయభ్రాంతులవుతున్న మా యూనిట్ సభ్యుల్ని కూడా అర్ధం చేసుకుని మా టీజర్ లాంఛ్ వెన్యూ ఛేంజ్ చేసుకుంటున్నాం..!

కొందరు పాత్రికేయ మిత్రులూ, స్నేహితుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఈ సినిమా టీమ్ ఓ నోట్ రిలీజ్ చేసింది.
అంతేగా.! అంతేగా.! దయ్యాలతో ఆటలాడితే మామూలుగా వుండదు మరి.. మొత్తానికి ఎటువంటి నష్టం జరక్కుండా ముందుగానే జాగ్రత్త పడ్డారులే.!
Also Read: Sahithi Dasari.. లోకల్ టాలెంట్‌ని గుర్తించరేం.!?
ఆత్మలకీ అదేనండీ..దెయ్యాలకీ మనోభావాలుంటాయ్ మరి. వాటిని దెబ్బ తీస్తే చాలా.. బా..గో..దు.!