Table of Contents
Genelia Dsouza Deshmukh.. హా..హా.. హాసినీ అంటే ఎవ్వరికి గుర్తుండదు చెప్పండి. ‘బొమ్మరిల్లు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ తన నల్లా నల్లాని కళ్లతో కుర్రోళ్ల గుండెల్ని పిండి పారేసింది. అర్ధమైపోయుంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.
అవునండీ ఆ బబ్లీ గాళ్ జెనీలియానే (Genelia Deshmukh) . ‘బాయ్స్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత ‘బొమ్మరిల్లు’, ‘సై’ తదితర సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్ని తెగ మెప్పించిన సంగతి తెలిసిందే.
Genelia Deshmukh.. లవ్ స్టోరీ – సినిమా ట్విస్టుల్ని మించి
చాలా త్వరగా కెరీర్‌లో ఎత్తుల్ని చూసేసింది. కెరీర్ ఫుల్ స్వింగ్‌లో వున్న టైమ్‌లోనే బాలీవుడ్ యంగ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమ వ్యవహారం సాగించింది.
అదో టైపు లవ్ ట్రాక్ అది. సినిమా స్టోరీలాగే ట్విస్టుల మీద ట్విస్టులు నడిచాయ్ జెనీలియా (Genelia Deshmukh) లవ్ స్టోరీలో. ఎట్టకేలకు కోరుకున్న ప్రియుడినే పెళ్లి చేసుకుందనుకోండి. ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది కూడా.
హీరోయిన్ అయితే ఓకే, లేకుంటే నాట్ ఓకే..
సరే, అంతా బాగానే వుంది. ఎప్పటినుంచో జెనీలియా సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేస్తుంది.. అంటూ చాన్నాళ్ళ నుంచీ వార్తా కథనాలొస్తున్నాయ్. కానీ హీరోయిన్ ఛాన్సులయితేనే ఒప్పుకుంటా.. అంటూ అప్పట్లో జెనీలియా (Genelia Deshmukh) తెగేసి చెప్పేసేది తన వద్దకు వచ్చిన దర్శక నిర్మాతలకి. దాంతో అమ్మడిని లైట్ తీసుకున్నారట. అలా చాలా అవకాశాలు చేజారిపోయాయ్ కూడా.

కానీ, ఇప్పుడు.. అవకాశాల కోసం జెనీలియా టాలీవుడ్డూ, కోలీవుడ్డూ, బాలీవుడ్డూ.. అంటూ అన్ని వుడ్లూ గిర్రా గిర్రా తిరిగేయక తప్పడంలేదు. ఎట్టకేలకు టాలీవుడ్‌లో ఓ ఛాన్స్ దక్కించుకుంది జెనీలియా.
Genelia Deshmukh తో కూసింత కష్టమే సుమీ.!
ప్రముఖ పొలిటీషియన్ గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో జెనీలియా (Genelia Dsouza) నటిస్తోంది. సినిమాలో హీరోయిన్‌గా కాదులెండి. హీరోకి అక్క పాత్ర అంట. ‘పెళ్ళిసందడి’ ఫేం శ్రీలీల (Sree Leela) ఈ సినిమాలో హీరోయిన్.
మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసేసింది అందాల హాసిని జెనీలియా. ఇక్కడే ఇంకో ట్విస్టుంది. జెనీలియా హీరోయిన్‌గా చేసినప్పుడే నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేసేదనే రూమర్ సినీ సర్కిల్స్‌లో బాగా వినిపించేది.
Also Read: Bindu Madhavi.. ప్రేమ ఎంత కఠినం.!
అలాంటిది, ఇప్పుడు.. ‘స్పెషల్’ రోల్ అంటే, ఇంకెంత స్పెషల్ ట్రీట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందో మరి జెనీలియా.
మరో ఇంట్రెస్టింగ్ ముచ్చటేంటంటే, గ్లామర్ విషయంలో నేను అప్పుడూ ఇప్పుడూ ఒకేలా వున్నాను ‘ఏ మాత్రం హద్దులు దాటకుండా..’ అంటూ ఓ స్టేట్‌మెంట్ కూడా పాస్ చేసింది జెనీలియా (Genelia Deshmukh). దానర్ధం ఏంటో ఆమెకే తెలియాలంటూ సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. రీ-ఎంట్రీలో గ్లామర్ చూపిస్తానంటూ జెనీలియా సంకేతాలిస్తోందని అనుకోవాలా.?