Table of Contents
Tourist Family Telugu Review.. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే సినిమా గురించి, ‘జక్కన్న’ రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా వేదికగా స్పందించారు.!
దాంతో, ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులకీ ఒకింత ఆసక్తి కలిగింది. ఓటీటీలో రాగానే, ‘ఉచితమే’ కదా.. అందరూ ఎగబడి చూసేశారు.!
ఎగబడి కాదుగానీ, కాస్త తీరుబడిగా నేనూ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా చూశాను.! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదు.. ఇంకా, ఆ ‘ఊపు’లోనే వున్నాన్నేను.!
Tourist Family Telugu Review.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాలిగానీ..
భారత దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల మీద ఉక్కుపాదం మోపాల్సిన సందర్భమిది. ఊరూవాడా జల్లెడపడుతున్నారు అధికారులు.
సరిగ్గా, ఈ సమయంలోనే, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా వచ్చింది. శ్రీలంక నుంచి తమిళనాడుకి అక్రమంగా వలస వచ్చిన ఓ కుటుంబానికి సంబంధించిన కథ.
కథలో, ‘బాంబ్ బ్లాస్ట్ ఘటన.. దానికి, అక్రమంగా వలస వచ్చినవారితో లింకు’ అంశాన్ని కూడా జోడించారు. కట్ చేస్తే, వలస వచ్చిన కుటుంబం చాలా మంచిది.. అని చూపించారు.
హీరో.. మర్యాద రామన్న..
హీరో, ‘మర్యాద రామన్న’ టైపు అన్నమాట. కలుపుగోలుతనం ఎక్కువ. అలా, ఓ కాలనీలో అందరితోనూ కలిసిపోతుంది ఆ కుటుంబం.!
బాంబ్ బ్లాస్ట్ కేసుని ఛేదించే క్రమంలో, టూరిస్ట్ ఫ్యామిలీ ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఆ కాలనీ జనాలంతా, ఆ టూరిస్టు ఫ్యామిలీని రక్షించేస్తారు.. పోలీసులకు దొరక్కుండా.
ఓ మంచి పోలీసు సాయం కూడా దొరుకుతుంది ‘అక్రమంగా వలస వచ్చిన’ ఆ కుటుంబానికి. మొత్తం కథ చెప్పేసినట్లే.! సినిమాగా చూసుకుంటే, ఓకే.. బానే వుంది.
సింపతీ ఎందుకు.?
కానీ, శ్రీలంక నుంచి అక్రమంగా వలస వచ్చిన కుటుంబం మీద, ‘సింపతీ’ క్రియేట్ చేయాలన్న దర్శకుడి ఆలోచనే, అనుమానాస్పదంగా వుందిక్కడ.
అక్రమంగా వలస వెళితే, మనల్ని ప్రపంచంలో ఏ దేశమైనా అక్కున చేర్చుకుంటుందా.? తన్ని తరిమేస్తుంది. మనమేంటో, మన పద్ధతులేంటో. ఇలాంటి సినిమాల్ని కూడా ప్రోత్సహిస్తున్నాం.
నిజానికి, కథ అలాగే కథనాలు ఏమంత గొప్పగా లేవు. నటీనటుల ప్రతిభ.. అని చెప్పుకోవడానికి కూడా, అంత గొప్పగా ఏమీ లేవు. జస్ట్ అలా సినిమా సాగిపోతుందంతే.
Also Read: సీరియస్ పొలిటీషియన్ ‘కవిత’ సెల్ఫ్ గోల్.!
అయినా, ఎందుకు సెలబ్రిటీలు ఎగబడి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాని ప్రమోట్ చేసినట్లు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
అన్నట్టు, మామూలుగా అయితే ఓటరు కార్డు లభించడం అంత తేలిక కాదు. కానీ, శ్రీలంక నుంచి అక్రమంగా వలస వచ్చిన కుటుంబానికి ఓటరు కార్డులు వచ్చేస్తాయ్. ఆధార్ కార్డులు కూడా.
డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చేస్తుంది శ్రీలంక నుంచి తమిళనాడుకి అక్రమంగా వలస వచ్చిన హీరోకి. అదో మ్యాజిక్. సినిమాటిక్ లిబర్టీ అందామా.? వ్యవస్థల మీద దర్శకుడికి చిన్న చూపు అందామా.?
తెలుగు ప్రజల మధ్యనే, ఆంధ్ర – తెలంగాణ అనే ‘గీత’ కనిపిస్తోంది. తమిళనాడు – కర్నాటక మధ్య పంచాయితీ సరే సరి.! కానీ, అక్రమ వలస దారులు మాత్రం ‘గ్రేటు’.! బావుందయ్యా టూరిస్టు ఫ్యామిలీ.!