Glamorous Mudra Amyra Dastur.. అందగత్తెలకు ఆభరణాలు అవసరమా.? వారి అందమే ఆభరణం. అలాంటి అందమే అమైరా దస్తూర్ సొంతం.
‘మనసుకు నచ్చింది’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ అమైరా దస్తూర్.
ఆమె క్యూట్ క్యూట్ అందం, అభినయంతో అందర్నీ కట్టి పడేసింది తొలి సినిమాతోనే. కానీ, ఎంతో కాలం తెలుగు ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది.
కేవలం రెండే రెండు సినిమాల్లో నటించి, తెలుగు తెరకు దూరమైంది అమైరా దస్తూర్. కానీ, సోషల్ మీడియాలో ఎఫ్పుడూ యాక్టివ్‌గా వుంటూ ఫ్యాన్స్‌ని ఎంగేజ్ చేసుకుంటూనే వుంటుంది అమైరా దస్తూర్.
తాజాగా ఓ మ్యాగజైన్ కోసం అమైరా దస్తూర్ చేయించుకున్న స్పెషల్ ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది.
Glamorous Mudra Amyra Dastur.. అందమ్ బంగారమ్.!
క్రీమ్ కలర్ డిజైనర్ వేర్ ధరించిన అమైరా దస్తూర్ అందానికే అందమా అన్నట్లుంది. అంతేనా.! ఈ అందాల బొమ్మకు అలంకరించిన ఆభరణాలు ఈ ఫోటోల్లో మెయిన్ అస్సెట్.
ముఖ్యంగా ఆ చెవుల కమ్మలు ఎక్స్‌లెంట్. పొడుగాటి ఆ గోల్డెన్ జుమ్కాలు.. అమైరా దస్తూర్ బంగారు మేని ఛాయతో పోటీ పడుతూ ఆమె అందాన్ని మరింత పెంచేస్తున్నాయ్.

అలాగే చేతి వేళ్లకు గొలుసుల్లాంటి వుంగరాలు.. డిఫరెంట్ డిజైన్స్‌లో రూపొందించిన గాజులు..
ఇలా ఒక్కటేమిటి అమైరా ఒంటిపై ఒదిగిపోయేందుకా తయారయ్యాయా.? అన్నట్లుగా రూపొందించబడ్డాయ్ ఈ అందమైన ఆభరణాలు.
Also Read: ఆ బడ్జెట్టూ.. ఆ వీఎఫ్ఎక్సూ! అందుకే ఈ సక్సెస్సూ!
వీటిని ధరించిన అమైరా దస్తూర్ అందానికి ఆకాశమే హద్దు అన్నట్లుగా వుంది. మేనిఛాయలో కలిసిపోయేలా డిజైన్ చేసిన శారీలో అమైరా దస్తూర్ ఇచ్చిన క్యూట్ క్యూట్ పోజులు వేరే లెవల్.
అందుకే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయ్.
