Glamorous Mudra Navya Swamy.. బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అవ్వడం సహజమే.
చాలా మంది బుల్లితెర నటీ నటులు వెండితెరకు ప్రమోట్ అయ్యి సక్సెస్ అయిన వాళ్లున్నారు.
వెండితెరపై సక్సెస్ అయ్యాకా, బుల్లితెరను విడిచి పెట్టేసినవాళ్లూ లేకపోలేదు.
కానీ, కొంతమంది మాత్రం, ఇటు బుల్లితెరనీ, అటు వెండి తెరనీ కూడా ఈక్వెల్ ఇంపార్టెన్స్‌తో మేనేజ్ చేస్తున్నవాళ్లున్నారు. అలాంటి వాళ్లలో అందాల నటి నవ్య స్వామి కూడా ఒకరు.

బుల్లితెరపై పలు సీరియల్స్.. షోలతో పాపులర్ అయిన నవ్య స్వామికి సోషల్ మీడియాలో క్రేజ్ చాలా ఎక్కువ.
వెండితెరపై అడపా దడపా సినిమాలు చేస్తూనే బుల్లితెరపైనా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తోంది.
Glamorous Mudra Navya Swamy.. కలుపుగోలుతనం..
మంచి నటనతో పాటూ, ఆకట్టుకునే అభినయం, అందం కలబోసిన అందాల భామ నవ్య స్వామి.
అందరితోనూ స్నేహంగా మెలుగుతుంటుంది. ఈ సహజ గుణం అందరికీ ఆమె కెరీర్‌లో సక్సెస్ అయ్యేలా చేసింది.
‘బుట్టబొమ్మ’సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బుల్లితెర నటుడు రవికృష్ణతో అఫైర్ అంటూ వచ్చిన గాసిప్స్ కూడా నవ్య స్వామి పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచేలా చేశాయ్.

నటుడు రవికృష్ణ బిగ్‌బాస్ గేమ్ షోలో కంటెస్టెంట్‌గా వున్న రోజుల్లో బయటి నుంచి బాగా సపోెర్ట్ అందించింది.
ఆ తర్వాత సోషల్ మీడియాలో పలు గ్లామర్ షూట్స్.. అలా అలా నెటిజన్స్‌కి బాగా దగ్గరైపోయింది నవ్య స్వామి.
హీరోయిన్‌గానూ ప్రయత్నాలూ..
అందం, అభినయంతో పాటూ, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా వున్న నటి. కావడంతో హీరోయిన్‌గానూ పలు ప్రయత్నాలు చేసింది నవ్య స్వామి.
కానీ, కాలం ఇంకా కలిసి రాలేదు. చిన్న చిన్న పాత్రలతోనూ సరిపెట్టుకుంటోంది.
Also Read: అమృత ఫడ్నవిస్ వస్త్రధారణపై ఎందుకింత రచ్చ.?
ప్రస్తుతం మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమాలో నవ్య స్వామి ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోందనీ సమాచారం.

అటెన్షన్ కోసం కాదుగానీ, అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటుంది నవ్య స్వామి.
తాజాగా నవ్య స్వామి పోస్ట్ చేసిన మోడ్రన్ జీన్స్ ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయ్.
