తమిళ రాజకీయాల్లోకి త్రిష తెరంగేట్రం.?

 తమిళ రాజకీయాల్లోకి త్రిష తెరంగేట్రం.?

Trisha Krishnan

Trisha Krishnan Politics Tamilnadu.. సినీ నటి త్రిష తెలుసు కదా.? అలా ఎలా మర్చిపోతాం.? ఇప్పటికీ నటిగా తనకంటూ ఓ తిరుగులేని స్టార్‌డమ్ కొనసాగిస్తూనే వుంది త్రిష కృష్ణన్.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమాలో త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘ఆచార్య’ సినిమాకి తొలుత త్రిషనే అనుకున్నారు, ఆ తర్వాత కాజల్ అగర్వాల్ వచ్చింది.. కానీ, చివరికి కాజల్ అగర్వాల్ పాత్రని కూడా లేపేశాడు దర్శకుడు కొరటాల శివ.. అది వేరే చర్చ.

Trisha Krishnan Politics Tamilnadu.. రాజకీయాల్లోకి వస్తున్నావా.?

అసలు విషయంలోకి వస్తే, త్రిష రాజకీయాల్లోకి రాబోతోందిట. తమిళ రాజకీయాలపై తనదైన ముద్ర వేయాలని త్రిష ఉవ్విళ్ళూరుతోందట.

Trisha Krishnan Vijay
Trisha Krishnan Vijay

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తమిళ హీరో విజయ్ ద్వారా త్రిష రాజకీయాల్లోకి రాబోతోందిట. విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నాడు.

సినిమాల్లో తిరుగులేని స్టార్‌డమ్ వున్నా, రాజకీయాల్లోకి వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేసుకుంటున్నాడు విజయ్.

జయలలిత తరహాలో..

తమిళనాట ఎంజీఆర్ అనే పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ ఎంజీఆర్ ద్వారానే జయలలిత రాజకీయాల్లోకి రావడం తెలిసిన విషయమే.

Trisha Krishnan
Trisha Krishnan

అప్పట్లో ఎంజీఆర్ వెంట జయలలిత.. ఇప్పుడు విజయ్ వెంట త్రిష.. అంటూ తమిళనాట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అది కూడా మతిస్తిమితం కోల్పోయినా మీడియాకి బోల్డంత కంటెంట్ ఇస్తున్న సింగర్ సుచిత్ర వాగుడుతో ఈ పుకార్లు జోరందుకోవడం గమనార్హం.

ఇవన్నీ ఉత్తి పుకార్లేనా.? నిజంగానే త్రిష రాజకీయాల్లోకి రాబోతోందా.? రాజకీయాల్లోకి వస్తే, జయలలితలా త్రిష పొలిటికల్ స్టార్‌డమ్ సంపాదించుకుంటుందా.? వేచి చూడాల్సిందే.

Digiqole Ad

Related post