Table of Contents
Global Star Ramcharan Birthday.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు.. ఇది అందరికీ తెలుసు.
రామ్ చరణ్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబాయ్ గనుక.. అటు మెగా.. ఇటు పవర్.. రెండూ కలగలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయిపోయాడు.!
ఏదో అలా కలిసొచ్చిన గుర్తింపు కాదిది.! నిజమే, తండ్రి మెగాస్టార్ చిరంజీవి నుంచి నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు రామ్ చరణ్.
అయితే, అది తొలి సినిమా లాంఛింగ్ వరకు మాత్రమే. నటుడిగా రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి.
Global Star Ramcharan Birthday.. ఆ డాన్సులు.. ఆ పైట్స్..
చిరంజీవి అంటే ముందుగా డాన్సులు.. ఆ డాన్సుల్ని మ్యాచ్ చేశాడు తొలి సినిమా ‘చిరుత’తోనే. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అయితే, తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు ‘చిరు’ సినిమాతోనే.
ఇక, అక్కడి నుంచి రామ్ చరణ్ వెనుదిరిగి చూడలేదు. ‘ఆరెంజ్’ రూపంలో అతి పెద్ద డిజాస్టర్ వచ్చినా, చరణ్ ఇమేజ్ గ్రాఫ్ ఏనాడూ కిందికి పడింది లేదు.

‘ఆచార్య’ సినిమాలో చరణ్ – చిరంజీవి కలిసి నటిస్తే, అది డిజాస్టర్ అయ్యింది.. కానీ, రామ్ చరణ్ అప్పటికే గ్లోబల్ స్టార్ అయిపోయాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆషామాషీ ఇమేజ్ కాదిది. ఎవరో పనిగట్టుకుని, బలవంతంగా రుద్దిన గుర్తింపు కూడా కాదు.
గ్లోబల్ స్టార్.. ఆషామాషీ వ్యవహారం కాదు..
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ ‘గ్లోబల్ స్టార్’ అనిపించుకున్నాడు. యావత్ సినీ ప్రపంచం ఆయన్ని నటుడిగా మెచ్చుకుంది.
ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా కీర్తి పతాక ఎగరడంలో రామ్ చరణ్ పాత్ర తక్కువేమీ కాదు. ‘ఆర్ఆర్ఆర్’ అంటే రాజమౌళి, రామ్ చరణ్, రామారావు (జూనియర్ ఎన్టీయార్).

ఆ ‘ఆర్ఆర్ఆర్’ త్రయంలో ఒకడైన రామ్ చరణ్.. తన గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని మరింత పటిష్టం చేసుకునే దిశగా మంచి మంచి కథల్ని ఎంచుకుంటున్నాడు.
ఇప్పుడు చేస్తున్నవీ, ఇకపై చేసేవీ.. అన్నీ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాదు, గ్లోబల్ సినిమాలు కూడా.!
ఎంత ఎదిగినా..
ఎంత ఎదిగినా ఒదిగి వుండడం మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ సీక్రెట్. అదే, ఆ ఉన్నత వ్యక్తిత్వాన్ని తండ్రి నుంచి వారసత్వంగా పొందాడు రామ్ చరణ్.
తండ్రికి తగ్గ తనయుడు అనే స్థాయి నుంచి, తండ్రిని మించిన తనయుడు.. అనే స్థాయికి ఎదిగినా, ‘గ్లోబల్ స్టార్’ అనే బాధ్యతని మోయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

ఔను, నిజమే.. ‘గ్లోబల్ స్టార్’ (Global Star Ram Charan) అనేది జస్ట్ ఇమేజ్ కాదు, అదో బాధ్యత.! అదొక మెగా బాధ్యత.!
పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి (Happy Birthday Global Star Ram Charan) విషెస్ అందిస్తూ.. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.!