Table of Contents
మెగాస్టార్ చిరంజీవి (Godfather Review) 150 పైన సినిమాలు చేశాక కూడా, తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాలనే తపనతో వున్నారు. ఈ క్రమంలోనే ఆయన్నుంచి ‘సైరా నరసింహారెడ్డి’ వచ్చింది.
‘ఆచార్య’ సినిమా కూడా అలా వచ్చిందే. ‘గాడ్ ఫాదర్’ సినిమా మెగాస్టార్ చిరంజీవిలో మరో కోణాన్ని చూపించనుందని సినిమా అనౌన్సమెంట్ దగ్గర్నుంచీ చాలామంది భావించారు.
మలయాళ సినిమా ‘లూసిఫర్’ని తెలుగులో చేయాలని చిరంజీవి డిసైడ్ అయినప్పుడే, ఆయన హిట్టుకొట్టేశారు.
Godfather Review.. ఆయనకు హిట్టు, ఫ్లాపుతో పనేముంది.?
నాన్సెన్స్.. చిరంజీవి ఈజ్ మెగాస్టార్.. ఆయనకు హిట్టు, ఫ్లాపుతో పనేముంది.? నటుడిగా తనకు తాను పరీక్ష పెట్టుకుంటున్నారంతే.!

నో డౌట్, ‘ఆచార్య’ సినిమా విషయంలో దర్శకుడు, చిరంజీవిని నిరాశపరిచాడు. కానీ, ‘లూసిఫర్’ సినిమా విషయంలో ఆ తప్పు జరగలేదు. తప్పు జరిగేందుకూ ఆస్కారం లేదు.
ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు.. చిరంజీవిని తెరపై అలా చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి కావాల్సిందే. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.! ఔను, మెగాస్టార్ చిరంజీవికి వయసు అయిపోలేదు.
మెగాస్టార్.. అంటే నిత్య యువకుడే మనసు పరంగా అనడానికి ‘గాడ్ పాదర్’ సినిమా ఓ ఉదాహరణ. హై ఓల్టేజ్ ఎనర్జీ.. అది కూడా అండర్ ప్లే చేస్తూ. ఆ ఎనర్జీ ఆయన చుట్టూ వైఫైలా కనిపిస్తుంటుంది.
‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలో పెద్ద వర్షం పడితే, అంతటి వర్షంలో తడుస్తూ, మాట తడబడని వ్యక్తిత్వం, ఎనర్జీ, కమిట్మెంట్ చిరంజీవిది.
కథ విషయానికొస్తే..
‘లూసిఫర్’ సినిమా చూడనోళ్ళు దాదాపుగా వుండరు గనుక, కథ గురించి విడమర్చి చెప్పుకోవాల్సిన పనిలేదు.
అధినేత మరణం కారణంగా దారి తప్పుతున్న పార్టీని దార్లో పెడతాడు హీరో. ఈ క్రమంలో ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేయడమే, ‘గాడ్ ఫాదర్’ సినిమా.
పార్టీనీ, ప్రభుత్వాన్నీ, ప్రజల్నీ కాపాడే శక్తి మన హీరోనే.! ఈ క్రమంలోనే హీరో వెనుక దాగి వున్న అసలు కోణం.. మరింత ఆసక్తిని కలిగిస్తుంది.
ఫ్రేమ్ టు ఫ్రేమ్.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. మలయాళ వెర్షన్ కొంత స్లోగా నడిస్తే, తెలుగు వెర్షన్ కోసం రేసీ స్క్రీన్ ప్లే తీసుకున్నారు.
వన్ టూ టెన్.. అన్నీ మెగాస్టార్.. అన్నట్లు, తెరపై అంతటా మెగాస్టార్ కనిపిస్తూనే వుంటారు. మలయాళ వెర్షన్‌తో పోల్చితే, తెలుగులో జరిగిన పెద్ద మార్పు ఇదే.
స్టామినా మేటర్స్..
ఒక్క సినిమాతో మెగాస్టార్ చిరంజీవి స్టామినాని తక్కువ అంచనా వేయలేం.. అని చాలామందికి అర్థమవుతుంది ‘గాడ్ ఫాదర్’ సినిమాతో.
‘బాస్ రా బచ్చాస్..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేసే సినిమా ‘గాడ్ ఫాదర్’. బాస్ ఈజ్ బ్యాక్.. ఇన్ స్టైల్.!
Also Read: కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్.. కార్లు కొనుక్కోలేరా.?
తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నిరవ్ షా సినిమాటోగ్రఫీ.. రామ్ లక్ష్మణ్‌ల యాక్షన్ కొరియోగ్రఫీ.. సల్మాన్ ఖాన్ స్పెసల్ ఎంట్రీ.. సత్యదేవ్ విలనిజం.. వాట్ నాట్.. అన్నీ ‘గాడ్ ఫాదర్’ సినిమాకి పెర్‌ఫెక్ట్‌గా కుదిరాయ్.!
దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కాదు, మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రాణం పెట్టేశాడనటం సబబేమో.!
చివరగా..
సినిమా బావుంది, చాలా బావుంది.. అయినా, రేటింగులు సరిగ్గా (సరైన రేటింగ్ అంటే, మూడున్నర.. ఆ పైన) వేయడానికి కుల జాడ్యమో, ఇంకో పైత్యమో అడ్డు వస్తున్నాయ్ కొందరికి.
మెగాస్టార్ చిరంజీవి సినిమాకి రేటింగ్‌తో పనేంటి.? హీ ఈజ్ ది బాస్.. కాదు కాదు, ది మెగా గాడ్ ఫాదర్.!