Gopichand Ramabanam ‘పక్కా కమర్షియల్’ అంటూ గతేడాది జూలైలో ప్రేక్షకుల్ని పలకరించాడు గోపీచంద్. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పిచ్చ కామెడీ అని ముద్ర వేయించుకుని విమర్శల పాలైంది.
యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 వంటి పెద్ద బ్యానర్‌ల నిర్మాణంలో రూపొందినప్పటికీ, రిలీజ్ తర్వాత సినిమా ఎంత దారుణంగా అబాసు పాలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ సినిమా తర్వాత గోపీచంద్ నుంచి వస్తున్న సినిమా ‘రామబాణం’. ప్రచార చిత్రాలు చూస్తుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పక్కాగా ఫాలో అయినట్లు కనిపిస్తోంది ‘రామబాణం’లో.
ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటూ, ఓ హిట్టు సినిమాకి వుండాల్సిన లెక్కలన్నీబాగానే ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ‘రామబాణం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు.
Gopichand Ramabanam.. ‘రామబాణం’.! టైటిల్‌తోనే పాజిటివ్ బజ్.!
గోపీచంద్‌తో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ‘ఖిలాడీ’ భామ డింపుల్ హయాతీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

టైటిల్ పరంగా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయ్. హెల్దీ కామెడీ జోనర్‌గా సినిమాని తెరకెక్కించినట్లు పలు ఇంటర్వ్యూల్లో గోపీచంద్ చెప్పుకొచ్చారు.
అలాగే, గోపీచంద్ కటౌట్‌కి తగ్గ యాక్షన్ కంటెంట్ కూడా వున్నట్లు ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్ధమవుతోంది.
ఎలాగైనా ‘రామబాణం’ సినిమాతో హిట్టు కొట్టాలన్న కసితో వున్నాడు గోపీచంద్. ఇంతవరకూ అయితే, పాజిటివ్ బజ్ బాగానే క్రియేట్ అయ్యింది సినిమాపై.
చూడాలి మరి, రిలీజ్ తర్వాత ‘రామబాణం’కు ఆడియన్స్ నుంచి ఎలాంటి తీర్పు రానుందో.!