Kajal Aggarwal Centric.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది చందమామ కాజల్ అగర్వాల్. పెళ్లయ్యి, ఓ బిడ్డకు తల్లిగా వున్నప్పటికీ కాజల్ ప్రెస్టీజియస్ ఆఫర్లతో జోరు చూపిస్తోంది.
ప్రస్తుతం ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. దీంతో పాటూ, రీసెంట్‌గా బాలయ్యతో ఓ ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యింది.
తాజాగా కాజల్ అగర్వాల్ మరో ప్రాజెక్టుపై సైన్ చేసినట్లు తెలుస్తోంది. వివరాలు ఇంకా తెలీదు కానీ, అదో హీరోయిన్ సెంట్రిక్ మూవీ అని అంటున్నారు.
సమంత అలా రష్మిక ఇలా..
ఇప్పటికే తోటి హీరోయిన్ సమంత లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో దూసుకెళుతోంది. నిన్న కాక మొన్న వచ్చిన రష్మిక మండన్నా కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

‘రెయిన్ బో’ అనే సినిమాతో లేడీ ఓరియెంటెడ్ రూల్స్‌కి పచ్చ జెండా వూపింది రష్మిక మండన్నా. ఇక, సమంత విషయానికి వస్తే, ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలతో ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకుంది.
Kajal Aggarwal Centric.. కాజల్ అగర్వాల్ కొత్త కొత్తగా..
ఇక, ఇప్పుడు కాజల్ వంతొచ్చింది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌ని కాజల్ టచ్ చేసింది లేదింతవరకూ. మొన్నా మధ్య ఓ వెబ్ సిరీస్‌లో నటించింది.
కానీ, అది వర్కవుట్ కాలేదు. లేటెస్టుగా ఓ లేడీ ఓరియెంటెడ్ కంటెంట్‌తో ఓ దర్శకుడు కాజల్‌ని అప్రోచ్ అయ్యాడట. కంటెంట్ నచ్చేయడంతో కాజల్ ఓకే చేసిందట.
ఓ ప్రముఖ బ్యానర్ ఈ సినిమాని నిర్మించబోతోందనీ తెలుస్తోంది. రేపో మాపో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. గ్లామరస్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ తదితర భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్‌కి తాజా ప్రాజెక్ట్ ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి మరి.