Gouri G Kishan Weight.. ఆమె ఓ సినీ నటి.! కాస్త బొద్దుగా వుంటుంది. హార్మోన్ సమస్యల కారణంగా, బరువు పెరిగింది. అయినా, సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు వస్తూనే వున్నాయి.
వున్నంతలో, కాస్త బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ, బరువు తగ్గలేకపోతోంది.! ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొంది.
మీడియా ముసుగులో కొందరు ఎర్నలిస్టులు, ఆమెపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. సినిమా గురించి అనుకునేరు.? కాదు, ఆమె బరువు గురించి.
ఏం చెప్పాలో తొలుత అర్థం కాలేదామెకి. కాస్త తేరు కుంది. క్లాస్ తీసుకుంది. ‘నా బరువుతో మీకొచ్చిన సమస్య ఏంటి.?’ అంటూ సినీ ఎర్నలిస్టుల్ని ఏకిపారేసింది.
Gouri G Kishan Weight.. కొన్నాళ్ళ క్రితం నివేదా థామస్ మీద కూడా..
కొన్నేళ్ళ క్రితం సినీ నటి నివేదా థామస్‌కి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఆమె బరువు పెరిగింది, విమర్శలు ఎదుర్కొంది. కానీ, ఆమె నుంచి సినిమాలు వస్తూనే వున్నాయి.
మళ్ళీ దాదాపు అలాంటి ప్రశ్నే, తాజాగా మరో సినీ నటికి ఎదురయ్యింది. ఈసారి బరువు ప్రశ్న ఎదుర్కొన్నది గౌరి జి కిషన్. తెలుగులో ఓ సినిమా చేసిందీమె.
‘శ్రీదేవి శోభన్ బాబు’ పేరుతో తెరకెక్కిన సినిమాలో నటించింది గౌరి జి కిషన్.!
అయినా, సినీ సెలబ్రిటీల్ని ప్రశ్నలతో వేధించడమే, సినీ ఎర్నలిస్టుల పనిగా తయారైపోయింది.
ఇంత జరుగుతున్నా, ఇలాంటివాళ్ళపై సినీ పెద్దలు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
Also Read: బుర్రలు బద్దలాసుపోయే ప్రశ్న: అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత.?
మొన్నామధ్య, సినీ నేహా శెట్టిని పుట్టుమచ్చల విషయమై ఓ సినీ ఎర్నలిస్టు జుగుప్సాకరమైన ప్రశ్న వేశాడు. మరో సినీ ఎర్నలిస్టు, మంచు లక్ష్మి వస్త్ర ధారణపై ఓ ఇంటర్వ్యూలో అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు.
చూస్తోంటే, సినీ ఎర్నలిస్టుల ముసుగులో ‘పర్వర్టెడ్ మైండ్ సెట్స్’ వున్న ‘రోగ్స్’ కొందరు సినీ మీడియాలోకి ప్రవేశిస్తున్నారా.? అన్న అనుమానాలు కలగకమానడంలేదు.!
