ఈ ఫోటోలో వున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టగలరా.? ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఇది. ఎంత క్యూట్‌గా వుందో కదా. అప్‌కోర్స్ చిన్నప్పుడు అందరూ క్యూట్‌గానే (Adah Sharma) వుంటారంటారా.?
ఈ ముద్దుగుమ్మ పెద్దయ్యాకా కూడా అంతే క్యూట్‌గా వుంటుందండోయ్. తెలుగులో తొలి సినిమాతోనే కుర్రకారుకు స్వీట్ ‘హార్ట్ ఎటాక్’ తెప్పించింది. తర్వాత కొన్ని సినిమాల ద్వారా సూపర్ హిట్స్ అందుకుంది.
అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఇలా చెప్పుకుంటూ పోతే, సినిమాల లిస్టు ఈ ముద్దుగుమ్మకి పెద్దదే వుందనుకోండి.
Adah Sharma మహా మాంఛి కళాకారిణి సుమండీ..
మరి, గుర్తు పట్టారా.? ఈ ముద్దుగుమ్మ ఎవరో.! తనేనండీ చబ్బీ గాళ్ డింపుల్ ఛిన్.. స్వీట్ అండ్ క్యూట్ ఆదా శర్మ. నిజమేగా అప్పుడే కాదు, ఇఫ్పుడు కూడా ఈ బ్యూటీ సో క్యూట్ కదా.!

సోషల్ మీడియాలో ఆదా శర్మకి ఓ రేంజ్ ఫాలోయింగ్ వుంది. డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్‌లో ఫోటో సెషన్లు చేయించుకోవడం అంటే, ఈ అమ్మడికి చాలా చాలా ఇష్టమట.
జస్ట్ ఫోటో సెషన్స్ కాదండోయ్. అమ్మడికి మల్లకంబ వంటి ప్రాచీన యుద్ద కళల్లోనూ ప్రావీణ్యం వుంది. అలాగే కుంగ్‌ఫూ వంటి యాక్షన్ కళలు కూడా మస్త్‌గా వున్నాయ్ అందాల ఆదా శర్మకి.
Also Read: ప్రాణాంతకమా.! ఫైటర్ సమంత ప్రచారాస్త్రమా.?
నితిన్ (Nithin) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కింది ‘హార్ట్ ఎటాక్’ సినిమా.
అందులో హయాతి పాత్రలో ఆదా శర్మ నటించింది. ఆ తర్వాత ‘క్షణం’ సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిందీ బ్యూటీ.

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించింది ఆదా శర్మ.
తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లోనూ ఆదా శర్మ నటించింది, నటిస్తోంది కూడా.