Hansika Motwani Husband.. శుభం పలకరా.. అంటే, పెళ్ళి కూతురు డాష్ డాష్ అన్నాడట వెనకటికి ఒకడు.
పెళ్ళి సంబరాల్ని ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అమ్మేసుకున్న సినీ నటి హన్సిక, పెళ్ళి ముచ్చట్లలో విడాకుల ప్రస్తావన తెచ్చి అందర్నీ విస్మయానికి గురిచేసింది.
‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక, తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించింది.
ఇటీవలే సొహైల్ అనే వ్యక్తితో పెళ్ళయ్యింది హన్సికకి. కానీ, ఆ సొహైల్ సెకెండ్ హ్యాండ్.! అదేనండీ, అతనికి ఆల్రెడీ పెళ్ళయిపోయింది.
సొహైల్ పెళ్లికి కూడా హన్సిక హాజరయ్యింది. కానీ, ఆ తర్వాత సొహైల్ – ఆయన మొదటి భార్యకి మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి.. ఇద్దరూ విడిపోయారు.
Hansika Motwani Husband ఎక్కడ తేడా కొట్టిందబ్బా.?
సొహైల్ తన మొదటి భార్యకు విడాకులవ్వడం వెనుక హన్సిక కీలక పాత్ర పోషించిందంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది.
తన సెకెండ్ హ్యాండ్ భర్త తొలి విడాకులపై క్లారిటీ ఇచ్చే క్రమంలో హన్సిక చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయ్.! అనవసరంగా కెలుక్కున్నట్టుంది ‘దేశముదురు’ పాప హన్సిక.!
Mudra369
కానీ, హన్సిక మాత్రం ఆ విడాకులకు తాను కారణం కాదంటోంది. ‘సొహైల్ గురించి అన్నీ నాకు తెలుసు. మేమిద్దరి ఇష్టపడ్డాం.. పెళ్ళి చేసుకున్నాం..’ అని హన్సిక సెలవిచ్చింది.
‘నా పెళ్ళి గురించి ఎలా వార్తలు లీక్ అయ్యాయో తెలియదు. లీక్ అవుతూనే, దుష్ప్రచారం మొదలైంది..’ అంటూ హన్సిక వాపోయింది.

ఆ దుష్ప్రచారం నేపథ్యంలోనే హన్సిక.. ఇదిగో ఇలా వివరణ ఇవ్వాల్సి వచ్చిందట. ఇంతకీ, సొహైల్ ఎందుకు అతని మొదటి భార్య నుంచి విడిపోయినట్టు.?
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
‘అన్ని విషయాలూ నాకు తెలుసు’ అంటున్న హన్సిక, ‘ఆ ఒక్క సీక్రెట్’ మాత్రం బయటపెట్టడంలేదు.
హన్సిక – సొహైల్ మధ్య ‘సంబంధమే’, సొహైల్‌కీ అతని భార్యకీ మధ్య గొడవలకు కారణమన్నది ఇప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.
గాసిప్స్‌ని లైట్ తీసుకోకుండా వివరణలు ఇచ్చుకుంటూ పోతే.. ఇదిగో ఇలాగే కొత్త డౌటానుమానాలు వస్తాయ్.