జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిస్తే, జనం గెలిచినట్టే.!

 జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిస్తే, జనం గెలిచినట్టే.!

Pawan Kalyan Jana Sena Party

Janasenani Pawan Kalyan Win.. ‘మేం అధికారంలోకి వస్తే, ప్రజల్ని ఉద్ధరిస్తాం..’ అని చెప్పే రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీల్నీ చూశాం.!

అధికారంలోకి వచ్చినా రాకున్నా.. గెలిచినా గెలవకున్నా.. ప్రజల కోసం పని చేస్తూనే వుంటానని చెప్పే నాయకులు ఈ రోజుల్లో ఎవరైనా వున్నారా.?

వున్నారు.. కాదు కాదు, ఒకే ఒక్కడు వున్నాడు.! అతనెవరో కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!

Janasenani Pawan Kalyan Win.. కష్టార్జితాన్ని కష్టాల్లో వున్నవారి కోసం వెచ్చించిన జనసేనాని..

సినిమా రంగంలో తిరుగులేని నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనం కోసం.. తన సంపాదనని ఖర్చు చేస్తూ వచ్చారు.!

కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడితే, వారి కుటుంబాలు దయనీయ స్థితిలోకి నెట్టబడితే, ఆ కుటుంబాల్ని ఆదుకున్నారు జనసేనాని.

Pawan Kalyan Jana Sena Party
Pawan Kalyan Jana Sena Party

ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

కోవిడ్ కష్ట కాలంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా తనవంతు ఆర్థిక సాయం అందించారు జనసేనాని.

చెప్పుకుంటూ పోతే, ఈ లిస్టు చాలా చాలా పెద్దదే.! సాయం కోరి ఎవరు తన వద్దకు వచ్చినా, చేతనైనంత సాయం జనసేనాని చేస్తూ వుంటారు.

సాయం మాత్రమే కాదు.. పోరాటం కూడా.!

సాయమొక్కటే సరిపోదు.. అణగదొక్కబడుతున్న ప్రజల కోసం ఆపన్న హస్తం అందిస్తూ, వారి తరఫున నాయకుడిగా పోరాడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ మీద అక్రమాస్తుల కేసుల్లేవు.. సాయం తప్ప, దోచుకోవడం తెలియదాయనకి. పోరాటం తప్ప, మోసం అస్సలు తెలియదాయనకి..

Mudra369

ఏడాది కాదు, రెండేళ్ళు కాదు.. జనసేన పార్టీని స్థాపించి.. పదేళ్ళు పూర్తయ్యింది.! ఈ పదేళ్ళలో, గెలుపోటములకు అతీతంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనం కోసం నిలబడ్డారు.

ఔను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవాలి.! చట్ట సభల్లో అడుగు పెట్టాలి.!

చట్ట సభలంటే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదిక.. అన్న మచ్చ చెరిగిపోవాలంటే, ప్రజల తరఫున మాట్లాడే జనసేనాని చట్ట సభల్లోకి అడుగు పెట్టి తీరాలి.

గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో గతంలో ఓటమి చవిచూసిన జనసేనాని, ఈసారి పిఠాపురం ప్రజల మనసుల్ని గెలుచుకుంటున్నారు.

Also Read: మామిడి పండుకీ బెయిల్‌కీ లింకేంటి.?

ఎవరెన్ని కుట్రలు పన్నినా జనం గెలవాలి, జనసేనాని గెలవాలి.! గెలిచి తీరాలి.!

జనసేనాని మాత్రమే కాదు, జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న మొత్తం 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, రెండు లోక్ సభ అభ్యర్థులూ.. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలవాల్సిందే.

Digiqole Ad

Related post