Hanuman Teja Sajja Sankranthi.. సంక్రాంతి పండక్కి సినిమా అనగానే, తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిసారీ పెద్ద రచ్చే జరిగిపోతోంది.! ఎందుకిలా.?
థియేటర్లు బోల్డన్ని వున్నాయ్.! సినిమా చూసే జనాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? సంక్రాంతి.. సినిమా.. ఈ రెండిటినీ విడదీసి చూడలేం.!
కానీ, ఒకేసారి సంక్రాంతికి పెద్దయెత్తున సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండడంతో లొల్లి షురూ అవుతోంది. పోనీ, ఇంతా చేసి ఓ నాలుగైదు పెద్ద సినిమాలు విడుదలవుతాయా.? అంటే, అదీ లేదు.!
ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’, ‘సైంధవ్’, ‘నా సామి రంగ’, ‘హనుమాన్’ సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిల్లో ‘హనుమాన్’ పాన్ ఇండియా మూవీ.!
Hanuman Teja Sajja Sankranthi.. టైమింగు బావున్నాగానీ..
ఓ వైపు అయోధ్య రామ మందిరం తాలూకు హడావిడి నడుస్తోంది. దేశమంతా ‘జై శ్రీరాం’, ‘జై హనుమాన్’ అని నినదిస్తున్న పరిస్థితి.
ఇలాంటి సందర్భంలోనే ‘హనుమాన్’ సినిమా వస్తే, కమర్షియల్‌గా ఆ సినిమాకీ వర్కవుట్ అవుతుంది. కానీ, సంక్రాంతికి ‘హనుమాన్’ థియేటర్లను దక్కించుకోవడం కష్టమైపోయింది.
పెద్ద సినిమా అంటే ఇదీ, చిన్న సినిమా అంటే ఇదీ.. అంటూ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ‘హనుమాన్’ టీమ్‌ని ఇబ్బంది పెట్టాయి.

‘గుంటూరు కారం’ సినిమాకి అత్యధిక థియేటర్లు దక్కుతాయి. ఆ తర్వాత ‘నా సామి రంగ’ సినిమా. ‘సైంధవ్’ కూడా ఫర్లేదు. అన్యాయమైపోయేది ‘హనుమాన్’ సినిమానే.!
సినిమా బావుంటే, సాయంత్రానికి థియేటర్లు ఆటోమేటిక్‌గా పెరుగుతాయని మెగాస్టార్ చిరంజీవి, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల్లో నిజముంది.
Also Read: రాయుడూ.! క్రికెట్‌లో బ్యాట్ ఎందుకు విరుగుతుంది.?
అయితే, సంక్రాంతి పండక్కి.. గౌరవ ప్రదమైన సంఖ్యలో థియేటర్లు దక్కితే, మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది (సినిమా బావుంటే) కదా.?
హైద్రాబాద్‌లో కాస్తం ఇంపార్టెన్స్ వున్న థియేటర్లే హనుమాన్‌కి దక్కకపోవడం గమనార్హం. దీనంతటికీ కారణమెవరు.? ‘హనుమాన్’ని ఇబ్బంది పెడుతున్నదెవరు.? జై శ్రీరామ్.. నువ్వే చూసుకోవాలి అన్నీ.. అంటోంది ‘హనుమాన్’ టీమ్.!