Happy Birthday Nani ఆయన సహజ నటుడు.! అందుకే, ‘నేచురల్ స్టార్ నాని’ అంటున్నాం. ప్రయోగాత్మక సినిమాలు చేస్తాడు, కమర్షియల్ సినిమాలతోనూ మెప్పిస్తాడు.!
నేచురల్ స్టార్ నాని నటించిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద వివిధ కారణాలతో ఫెయిల్ అయి వుండొచ్చు. కానీ, నటుడిగా నాని ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.
తెరపై అతను కనిపించడు.. అతను పోషించే పాత్రలే కనిపిస్తాయ్.!
Mudra369
నాని నటించడు.. ఆయా పాత్రల్లో జీవించేస్తాడు..
మన పక్కింట్లో కుర్రాడు.. మనింట్లో కుర్రాడు.. ఇదీ నాని అంటే.!
నేచురల్ స్టార్ నాని అనే గుర్తింపు అంత సహజంగా వచ్చిందంటే.. దటీజ్ నాని.!
అసలు తెరపై నాని (Natural Star Nani) కనిపిస్తున్నాడంటే, హీరోని చూసినట్లుండదు. మన పక్కింటి కుర్రాడు, మన ఇంట్లోని కుర్రాడే కనిపిస్తాడు. దటీజ్ నాని.!
Happy Birthday Nani స్వశక్తితో ఎదిగి..
సినీ పరిశ్రమలో బ్యక్గ్రౌండ్ అనేది ఏమీ లేకుండా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ.. ఆ లిస్టులోకి నాని కూడా చేరతాడు.
తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా.. ప్రతి సినిమాతోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటాడు నాని.

అందుకే, ‘అష్టాచెమ్మా’ దగ్గర్నుంచి, ‘అంటే సుందరానికీ..’ వరకూ.. ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్ని నాని తెరపై పోషించాడు.
‘శ్యామ్ సింగరాయ్’ అయినా, ఇంకో పాత్ర అయినా.. ఆయా పాత్రలకే వన్నె తెచ్చాడు నాని. ‘ఈగ’ సినిమా తీసుకుంటే, తెరపై నాని కనిపించకపోయినా, నాని ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతాం. దటీజ్ నాని.
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై.!
ఔను, నాని కెరీర్ పరంగా కొత్త ఫేజ్‌లోకి అడుగు పెట్టాడు. ఆ కొత్త ఫేజ్ ‘శ్యామ్ సింగరాయ్’తో మొదలైందని చెప్పొచ్చేమో.!

ప్రస్తుతం ‘దసరా’ సినిమా చేస్తున్నాడు నాని. నాని కెరీర్లోనే ఇది వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. తర్వాత చేయబోయే సినిమాలూ.. తనను తెరపై సరికొత్తగా ఆవిష్కరిస్తాయని నాని చెబుతున్నాడు.
అన్నట్టు..నేచురల్ స్టార్ నాని తన పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికరమైన ట్వీటేశాడు.
1984 ఫిబ్రవరి 24న తాను పుట్టాననీ, గడచిన పదిహేనేళ్ళలో శుక్రవారం రోజున మళ్ళీ మళ్ళీ కొత్తగా పుడుతున్నానని (సినిమా రిలీజుల గురించి) పేర్కొన్నాడు.
ఈ శుక్రవారం నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నవారందరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నట్లు చెప్పాడు నాని తన ట్వీట్ ద్వారా.
ఎంత స్టార్డమ్ వచ్చినా.. ‘నాని అంటే మనోడు, మన పక్కింటి కుర్రాడు.. మనింట్లోని కుర్రాడు..’ అన్న గుర్తింపే అతనికి మాంఛి కిక్ ఇస్తుందట.
Also Read: నచ్చావయ్యా నాగచైతన్యా.! బాలయ్యా.. చూసి నేర్చుకోవయ్యా.!
హ్యాపీ బర్త్ డే నాని.! మరిన్ని అద్భుతమైన చిత్రాలతో.. మరిన్ని అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మరింతగా అలరించాలని ఆశిస్తూ.! పుట్టినరోజు శుభాకాంక్షలు.!