Grandhalayam Sai Shivan.. సక్సెస్.. ఫెయిల్యూర్ అనేది వేరే చర్చ.! పెద్ద పెద్ద సినిమాలు అంచనాలు తప్పుతుంటాయ్. పెద్దగా అంచనాల్లేని సినిమాలు అద్భుత విజయాల్ని అందుకుంటుంటాయ్. దీన్ని సినీ మాయ అనాలో, ఇంకేమన్నా అనాలో.!
‘బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేదు.. సినిమాలో విషయం వుంటే, మనల్ని ముందుకు తీసుకెళుతుంది..’ అంటూ ‘అలా మొదలైంది’ సినిమా నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ ‘గ్రంధాలయం’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శివన్‌కీ, ఆ చిత్ర టీమ్‌కీ బోల్డంత బలాన్నిచ్చేలా వ్యాఖ్యానించారు.
చాలా అరుదుగా ఇలాంటి ‘మంచి’ మాటల్ని వింటుంటాం. చాలా సినిమా ఫంక్షన్లలో ‘ముఖస్తుతి’ కనిపిస్తుంటుంది. ‘గ్రంధాలయం’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో అది చాలా తక్కువగా కనిపించింది.
ఓ కుర్రాడు.. ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో కలిశాడు. పరిచయం చేసుకున్నాడు. తాను చేస్తున్న సినిమాల గురించి వివరించాడు.
ఏదో స్పార్క్ కనిపించింది ఆ కుర్రాడిలో. అతనే సాయి శివన్. ‘వైరం’ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ‘గ్రంధాలయం’ గురించి కూడా చూచాయిగా వివరించే ప్రయత్నం చేశాడు.
అతని మాటల్లో అప్పుడు నాకు కన్పించిన జెన్యూనిటీనే.. బహుశా ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్‌కి కూడా కన్పించి వుండొచ్చు.!
Mudra369
‘బిర్యానీ కోసం వచ్చిన బ్యాచ్ కాదిది.. పది మందే వచ్చినా, జెన్యూన్‌గా వచ్చారు..’ అని దామోదర్ ప్రసాద్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ అన్నారంటే, వచ్చిన వారిలోని జెన్యూనిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
‘పేద కుటుంబం నుంచి వచ్చాం.. మద్య తరగతి కుటుంబం నుంచి వచ్చాం..’ అని చెప్పే పరమ రొటీన్ సినిమా ప్రసంగాల్నీ దామోదర్ ప్రసాద్ ప్రస్తావించారు.
Grandhalayam Sai Shivan.. జెన్యూనిటీ కనిపించింది..
కానీ, ఆయనకీ ‘గ్రంధాలయం’ టీమ్‌లో ‘మధ్యతరగతి’ జెన్యూనిటీ కనిపించింది. అందుకేనేమో, దర్శకుడు సాయి శివన్‌తోపాటు హీరో విన్ను కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు.
‘ట్రైలర్’ గురించి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ మాట్లాడారు. తన తొలి సినిమా ‘ప్రతిధ్వని’లా ఈ ‘గ్రంధాలయం’ పెద్ద హిట్ అయి, దర్శకుడు సాయి శివన్‌కి మంచి గుర్తింపు తీసుకురావాలని బి.గోపాల్ ఆకాంక్షించడం గమనార్హం. నిజానికి, ఇది చాలా చాలా అరుదైన సందర్భం.
సాధారణంగా ఇలాంటి సినిమా ఫంక్షన్ల విషయంలో ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటాయి. పెయిడ్ బ్యాచ్‌తో అనవసర రాద్ధాంతం చేయిస్తుంటాయి. డ్రమెటిక్ ప్రశంసలు, ఫేక్ ఎమోషన్స్ కనిపిస్తుంటాయి. కానీ, ఇక్కడ పరిస్థితి చాలా భిన్నంగా కనిపించింది.
దర్శకుడి పేరు ప్రస్తావన వస్తే చాలు జెన్యూన్ హంగామా.. వచ్చిన ఆ కొద్దిమందిలోనూ స్పష్టంగా కనిపించడం గమనార్హం. బహుశా ఆ జెన్యూనిటీనే, ఈ ఈవెంట్‌కి అతిథులుగా హాజరైన బి.గోపాల్, దామోదర్ ప్రసాద్‌లను అమితంగా ఆకట్టుకుని వుండొచ్చు.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
‘గ్రంధాలయం’ ఓ థ్రిల్లర్ మూవీ అనీ, మాస్ ఆడియన్స్ మెచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో వుంటాయనీ, థియేటర్లకి వచ్చే ప్రేక్షకులకు మంచి అనూభూతిని ఈ సినిమా కలిగిస్తుందనీ దర్శకుడు సాయి శివన్ చెబుతున్నాడు.