Happy Birthday SreeLeela.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరా.? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఠక్కున చెప్పేసే పేరు శ్రీలీల. తెలుగులో ‘పెళ్లి సందD’ సినిమాతో తెరంగేట్రం చేసిందీ అందాల భామ.
అయితే తొలి సినిమా ఫలితం ఏమంత బాగా లేదు. కానీ, అమ్మడికి ఎక్కడ లేని క్రేజ్ దక్కింది ఎందుకో తెలీదు. తర్వాత మాస్ రాజా రవితేజతో ‘ధమాకా’ సినిమాలో నటించింది.
ఇంకేముంది.! బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. సక్సెస్ ఇచ్చిన కిక్ ఇలాగే వుంటుంది. ఈ కిక్‌కి లక్కు కూడా తోడవ్వడంతో వి వన్నా ఫాలో ఫాలో ఫాలో.. అంటూ తెలుగు మేకర్లు శ్రీలీల వెంటపడ్డారు.
Happy Birthday SreeLeela.. ఇంతలోనే ఎంత స్టార్‌డమ్.!
అవకాశాల మీద అవకాశాలిస్తూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఛెయిర్‌కి మార్గం సులభం చేసేశారు. మేకర్లే కాదు, హీరోలు కూడా శ్రీలీలే హీరోయిన్‌గా కావాలంటున్నారు.

దాంతో స్టార్ హీరోలూ, యంగ్ హీరోలూ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో శ్రీలీల ( SreeLeela) తెగ బిజీ అయిపోయింది.
మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, రామ్ – బోయపాటి సినిమాలోనూ శ్రీలీలే హీరోయిన్.
బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఓ సినిమా కోసం నితిన్‌తో జత కడుతోంది.
అదంటే ఇష్టం.. అందుకే ఇలా.!
మెగా కాంపౌండ్‌లో వైష్ణవ్ తేజ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే, ఓ కమర్షియల్ యాడ్ కోసం అల్లు అర్జున్‌తోనూ జత కట్టేస్తోంది శ్రీలీల.

ఇవే కాదు, ఇంకా చాలానే ప్రాజెక్టులు శ్రీలీల కోసం క్యూ కడుతున్నాయ్. ఇంత తక్కువ టైమ్‌లోనే అంత స్టార్‌డమ్ దక్కించుకోవడం పట్ల అభిప్రాయమేంటని అడిగితే..
ఇదేమీ స్టార్‌డమ్ కాదు.. నేనింకా చిన్న పిల్లనే. నేర్చుకోవాల్సింది చాలా చాలా వుంది.. అని క్యూట్ క్యూట్‌గా చెప్పేస్తోంది అందాల శ్రీలీల .

అలాగే, కమర్షియల్ సినిమాలే ఎంచుకోవడానికి కారణమేంటి.? అని అడిగితే, మాస్ రోల్స్ అంటే నాకిష్టం. ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం ఇంకా ఇష్టం..
Also Read: Ram Gopal Varma: ఆర్జీవీ.! కెలకడం సరదానా.? రోగమా.?
అందుకే అలాంటి పాత్రలే ఎంచుకుంటున్నా.. అని ఇంకోసారి క్యూట్ ఆన్సర్ ఇచ్చేసింది చలాకీ బేబీ శ్రీలీల. ఏదైనా స్టార్‌డమ్ దక్కాలంటే కష్టం ఒక్కటే కాదు, లక్కు కూడా తోడవ్వాల్సిందే..!
అది తోడైతే ఇదిగో ఇలాగే శ్రీలీల ( SreeLeela) మాదిరి వుంటుంది.