ఎల్కేజీ సదువుకే లక్షల్లో ఫీజులు.! అక్కడ పిల్లలకి ఏం నేర్పిత్తారేటి.?
Romantic Education From School Stage
Costly Education LKG UKG.. అతను అస్సలు చదువుకోలేదు.! ఓ మామూలు రోజు కూలీ.! తన కొడుకుని మాత్రం బాగా చదివించాలనుకున్నాడు.! కానీ, ఈ రోజుల్లో ‘చదువు’ అంటే, అత్యంత ఖరీదైన వ్యవహారం కదా.!
ఒకాయన ఓ మోస్తరు ఉద్యోగం చేస్తున్నాడు. బాగానే చదువుకున్నాడు. తన కుమార్తెను ఇంకా బాగా చదివించాలనుకున్నాడు. ఇక్కడా సేమ్, చదువు అత్యంత ఖరీదైన వ్యవహారం.
లక్షాధికారులు సైతం, తమ పిల్లల ‘చదువు’ అంటే, భయపడుతున్న రోజులివి. ఇంజనీరింగ్ విద్య కోసం ఏడాదికి అరవై డెబ్భయ్ వేలు వెచ్చిస్తే సరిపోతుందేమో. కానీ, ఎల్కేజీ చదువులకి అది సరిపోవట్లేదు.
కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజులంటే, వాచిపోతున్నాయ్. సాధారణ కాన్వెంట్లు సైతం, తల్లిదండ్రులని పీల్చి పిప్పి చేసేస్తున్నాయి ఆర్థికంగా.
Costly Education LKG UKG.. చదువు.. అంటేనే, దోపిడీ.!
బెంగళూరులో ఓ స్కూలు, ఎల్కేజీ విద్య కోసం దాదాపు రెండున్నర లక్షలు డిమాండ్ చేస్తోంది. ఇందులో ట్యూషన్ ఫీజు దగ్గర్నుంచి, బిల్డింగ్ ఫండ్ వరకు.. దాదాపు పది పదిహేను కాలమ్స్ వున్నాయ్.
ఒక్కో కాలమ్‌లో కనిష్ఠంగా వెయ్యి.. గరిష్టంగా అరవై వేలు.. వెరసి, మొత్తంగా రెండున్నర లక్షల ఫీజు కడితే తప్ప, ఎల్కేజీలో సీటు ఇవ్వదు సదరు స్కూలు.
హైద్రాబాద్‌లోని ఓ స్కూల్ విషయానికొస్తే, దాదాపు ఇక్కడా అంతే లెక్క.! రిజిస్ట్రేషన్ ఫీజు, వన్ టైమ్ ఫీజు.. బిల్డింగ్ డెవలప్మెంట్ ఫండ్.. అన్నీ కలిపి రెండు లకారాలు.!
‘బంధువుల్లో పరువు నిలబడాలంటే తప్పదు..’ అంటాడొకాయన. మరి, నీ ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి కదా.? అంటే, ‘నా చావు నేను చస్తా.. వేరే మార్గం లేదు’ అంటాడతడు.
స్కూల్ యూనిఫామ్, స్టేషనరీ.. ఇవన్నీ మల్ళీ పది వేల నుంచి పాతిక వేల రూపాయల వరకు వుంటున్నాయ్. ఐదో తరగతి తర్వాత చదువులకు ఇలాంటి ఫీజు.. అంటే, కాస్త ఆలోచించొచ్చేమో.
కానీ, ఎల్కేజీ నుంచే ఈ బాదుడు ఎందుకో.. అంత మొత్తం గుంజేసి, పసి పిల్లలకు వాళ్ళు నేర్పే చదువు ఏమిటో.. ఎవరికీ అర్థం కాదు.
ఫౌండేషన్ అంటే..
ఫౌండేషన్ సరిగ్గా వుండాలండీ.. అన్నది చాలా స్కూళ్లలో చాలా విరివిగా మాట్లాడే మాట. పిల్లల ఫౌండేషన్ ఎలా వుంటుందోగానీ, వాళ్ళు ఐదో తరగతికి వచ్చేసరికి.. తల్లిదండ్రులు చితికిపోవడం ఖాయం.
ప్రభుత్వ స్కూళ్ళని పేరెంట్స్ ఎందుకు ఆదరించడంలేదు.? విద్య మీద ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి కదా.? ఆ మాత్రం అవగాహన, చైతన్యం వుంటే.. ప్రైవేటు స్కూళ్లెందుకు దోచుకుంటాయ్.?
ఉద్యోగమైనా, ఇంకో పని అయినా.. ఒళ్ళు హూనమయ్యేలా చేసి సంపాదించేది ఎందుకు.? చదువుల పేరు చెప్పి, స్కూళ్ళకు దోచిపెట్టేటందుకు.!
‘ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ’ అనే పొలిటికల్ డైలాగ్ ఏళ్ళ తరబడి వినిపిస్తూనే వుంది. నియంత్రించడంలో మాత్రం ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నాయి.
ఒక్క స్కూల్లో ఐదో తరగతి తర్వాత ఐఐటీ, నీట్ ఫౌండేషన్.. అని చెబుతోంటే, ఇంకో స్కూల్లో మూడో తరగతి నుంచే అవన్నీ వుండాలండీ.. అని చెబుతున్నారు. ఇదీ నేటి చదువు.!