Happy New Year నూతన సంవత్సర శుభాకాంక్షలు.. హ్యాపీ న్యూ ఇయర్.. అసలు మన తెలుగు ఉగాది వుండగా.. ఈ ఇంగ్లీషు హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు.? అంటారు కొందరు. పేరు ఏదైతేనేం, సంబరాలు చేసుకోవడానికంటూ ఓ ప్రత్యేకమైన రోజుంటే సరిపోదా.? స్పెషల్ డే అవసరం లేదు, ఎందుకంటే.. ప్రతి రోజూ ప్రత్యేకమే.
డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 వస్తుంది. ఇందులో ప్రత్యేకత ఏముంటుందంటే, 365 రోజుల తర్వాత (లీపు సంవత్సరంలో 366 రోజుల తర్వాత) సంవత్సరం మారుతుంది మరి. సో, సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే.
Happy New Year.. పాత జ్ఞపకాల్ని మర్చిపోదామా..
ప్రతి యేడాదీ డిసెంబర్ 31న పాత చేదు జ్ఞాపకాల్ని మర్చిపోదాం.. కొత్త తీపి కబుర్లను విందాం.. అంటూ కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలనుకుంటాం.. ఇలా అనుకునేలోపు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తాం. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూనే, పాతబడిపోతుందంతా.!

అయినాగానీ, నిన్నటి చేదు జ్ఞాపకాల్ని పక్కన పెడదాం.. కానీ, గత సంవత్సరంలో జరిగిన మంచి విషయాల్ని గుర్తు పెట్టుకుందాం. తప్పుల్ని సరిదిద్దుకుందాం, కొత్తగా జీవితాన్ని మలచుకునేందుకు తొలి అడుగు కొత్తగా వేసేద్దాం. ప్రతియేడాదీ చెప్పుకునే మాటే ఇది. ఈసారి మళ్ళీ కొత్తగా ఆ పాత మాటే చెప్పుకుందాం. మంచి మాట కదా, ఎన్నిసార్లు అయినా చెప్పుకోవడానికి బాగానే వుంటుంది.
కొత్తగా మనల్ని మనం మార్చేసుకుందాం..
దురలవాట్లేమైనా వుంటే మానేసుకుందాం.. కొత్తగా ఎలాంటి దురలవాట్ల జోలికీ వెళ్ళకుండా వుందాం. వివాదాలకు దూరంగా వుందాం. మానసిక ఒత్తిడులు ఎప్పుడూ వుండేవే.. వాటిని వదిలేయాలనడం సబబు కాదు, వాటిని అధిగమించేందుకు ఉత్సాహంగా ప్రయత్నిస్తూనే వుందాం.
Also Read: వందేళ్ళూ బతికేద్దాం.. వీలైతే ఇంకో పాతికేళ్ళూ.!
ఆరోగ్యం, ఆర్థికం.. ఇలా అన్ని రంగాల్లోనూ మనల్ని మనం సరికొత్తగా తీర్చిదిద్దుకునేందుకు సరికొత్తగా ప్రయత్నిద్దాం.. విజయం సాధిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం. సమతుల ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్ర పోవడం.. నిత్యం వ్యాయామం చేయడం.. ఇవన్నీ ఇప్పటిదాకా చేసే సరి.. చేయకపోతే, కొత్తగా ప్రారంభించేస్తే మంచిది.
Happy New Year.. హ్యాపీ న్యూ ఇయర్.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు.!
– yeSBee