Sushmita Sen Love Story.. ఆమె వయసు నలభై ప్లస్సూ.. అతని వయసు ఇరవై ప్లస్సూ.. ఇద్దరి మధ్యా వయసు తేడా పధ్నాలుగేళ్ళూ.! కానీ, ప్రేమకు వయసు తేడా అనేది అడ్డంకి కాదు కదా.?
సచిన్ టెండూల్కర్ కంటే అతని భార్య అంజలి పెద్దది. ప్రియాంక చోప్రా కంటే ఆమె భర్త చాలా చిన్నోడు. చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలా జంటలే కనిపిస్తాయ్.!
అన్ని ప్రేమ కథలూ విజయ తీరాలకు చేరవు. కొన్ని ప్రేమ కథలు పెళ్ళి పీటలెక్కకుండానే ఆగిపోతాయ్. ఇంకొన్ని డేటింగ్‌తో అటకెక్కుతాయ్. మరికొన్ని పెళ్ళి పీటలెక్కాక కూడా పెటాకులైపోతాయ్. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న కథని ఎలాంటి కథగా అభివర్ణించాలి.?
Sushmita Sen Love Story.. సుస్మితకి ఏమయ్యింది.?
విశ్వ సుందరి సుస్మితా సేన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేముంది.? హిందీతోపాటు పలు భాషల్లో ఆమె సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్‌గా ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఓ వెలుగు వెలిగింది. డేరింగ్ అండ్ డాషింగ్.. అన్న పదాలకు నిలువెత్తు నిదర్శనంగా సుస్మితా సేన్ గురించి చెప్పుకోవాలేమో.

అసలు విషయమేంటంటే, సుస్మితా సేన్ లేటు వయసులో ఓ కుర్రాడితో ప్రేమలో పడింది. అప్పటికి ఆ కుర్రాడికి 30 ఏళ్ళు కూడా లేవు. ఆమెకు మాత్రం 40 ఏళ్ళు పైనే. ఇద్దరి మధ్యా వయసు తేడా 15 ఏళ్ళు. ముందే చెప్పుకున్నాం కదా, ప్రేమకు వయసు తేడాతో వచ్చిన నష్టమేమీ లేదని.
అతనెవరో కాదు, ఫ్యాషన్ మోడల్ రోహ్మాన్ షాల్. దాదాపు మూడేళ్ళపాటు సుస్మిత, రోహ్మాన్ (Sushmita Sen Rohman Shawl) ప్రేమాయణం బాగానే నడిచింది. మొదట్లో మామూలు స్నేహం అన్నారు.
ఆ తర్వాత బలమైన స్నేహం అన్నారు. కొన్నాళ్ళ తర్వాత తామిద్దరం డేటింగ్ చేస్తున్నామన్నారు. సహజీవనం కొన్నాళ్ళు సాగింది.. ఎన్నెన్నో ప్రేమపూరితమైన మాటలు చెప్పుకున్నారు.
ఎక్కడ తేడా కొట్టింది చెప్మా.?
ఎక్కడ తేడా కొట్టిందోగానీ, రోహ్మన్ – సుస్మిత విడిపోయారు. స్నేహితుల్లా కలిశాం.. స్నేహితుల్లానే విడిపోదాం.. అంటూ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ ‘బ్రేక్-అప్’ని ప్రకటించేశారు. అన్నట్టు, సుస్మితా సేన్ (Sushmita Sen) ఇద్దరు పిల్లలకు తల్లి. ఆమె వారికి జన్మనివ్వలేదు.. వారిని చాన్నాళ్ళ క్రితమే దత్తత తీసుకుంది.
ఒకప్పుడు, ‘నాకు మగాడి అవసరం లేదు. సింగిల్ విమెన్‌గా నేను నా జీవితాన్ని కొనసాగించగలను..’ అని చెప్పింది. వావ్.. నీ గట్స్ సూపర్బ్.. అన్నారు చాలామంది సుస్మితని చూసి.
Also Read: Priyanka Chopra ‘ప్రేమకథ’కి ఏమైంది చెప్మా.?
ఇద్దరు ఆడ పిల్లల్ని దత్తత తీసుకుని, ఆమె చాలామందికి రోల్ మోడల్ అయ్యింది కూడా. కానీ, రోహ్మాన్‌తో సుస్మితా సేన్ (Sushmita Sen Love Story) ఎందుకు ప్రేమలో పడింది.? ఎందుకు విడిపోయింది.? అదైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.