Harihara Veeramallu Two Parts.. ఒక సినిమాని రెండు, వీలైతే అతకన్నా ఎక్కువ భాగాలు చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. లాంగ్ ఇంటర్వెల్ లాంటిదన్నమాట.!
రామ్ గోపాల్ వర్మ తీసిన ‘రక్తచరిత్ర’తో ఈ ట్రెండ్ మొదలైందని అనుకోవచ్చేమో. ‘బాహుబలి’కి ఈ ట్రెండ్ బాగా వర్కువుట్ అయ్యింది.
‘పుష్ప’ విషయంలోనూ అదే జరుగుతోంది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘కేజీఎఫ్’ ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయ్.!
Harihara Veeramallu Two Parts.. ‘హరిహర వీరమల్లు’ సంగతేంటి.?
చాలాకాలంగా ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ జరుగుతూ జరుగుతూ వుంది. ఇంకా 40 శాతం మేర సినిమా షూటింగ్ పూర్తవ్వాల్సి వుందట.
మరెలా.? పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో రోజురోజుకీ మరింత బిజీ అవుతున్నారాయె. ఇంకోపక్క ఎడా పెడా సినిమాల్నీ ఒప్పేసుకుంటున్నారు.
రెండు సినిమాలు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయ్ కొత్తగా. ఇంకోటి రెడీగా వుంది. అంటే, ‘హరిహర వీరమల్లు’ సినిమాకి ఇకపై పవన్ డేట్లు కుదిరే అవకాశం లేదన్నమాట.
Also Read: సమంత ‘ఖుషీ’.! విజయ్ దేవరకొండకి పెద్ద దెబ్బే.!
పూర్తయిన సినిమాని ఓ పార్ట్‌గా విడుదల చేసేస్తే ఓ పనైపోతుందని నిర్మాత ఏఎం రత్నం అనుకుంటున్నాడన్నది తాజా ఖబర్. అది కూడా మంచి ఐడియానే.
క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి బాబీ డియోల్‌ని ఈ సినిమా కోసం దించారు.
ఇంతకీ, ఈ రెండు ముక్కల గాసిప్ సంగతేంటి.? ఉత్త గాలివార్తేనా.? నిజమేనా.? వేచి చూడాల్సిందే.