Harish Shankar Pawan Kalyan.. పవన్ కళ్యాణ్ అభిమానులు అతి చేశారట. అలాగని, ఇంకో పవన్ కళ్యాణ్ అభిమాని చెబుతున్నాడు. వినడానికి కామెడీగానే వున్నా ఇది నిజం.
హర్టయిన అభిమాని పేరు హరీష్ శంకర్. అదేనండీ ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్. ‘అభిమానులంటే నా బ్రదర్స్ అనుకుంటాను.. నేనూ వాళ్ళలో ఒకడ్ని..’ అని చెప్పాడు హరీష్ శంకర్.
తమిళ సినిమా ‘తెరి’ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Harish Shankar Pawan Kalyan.. భవదీయుడు కాస్తా ఉస్తాద్ అయ్యాడు..
తొలుత ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో సినిమా చేద్దామనుకున్నాడు. కానీ, అందులోంచి ‘భవదీయుడు’ మాయమై, ‘ఉస్తాద్’ వచ్చింది.
హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ.. ఏవీ మారలేదు. కానీ, పేరులోంచి కొంత భాగం మాయమై, కొత్త పేరు యాడ్ అయ్యిందంతే.
సరే, అలా ‘మార్పు’ జరగడానికి చాలా కారణాలు వుంటే వుండొచ్చుగాక. బ్యాక్ టు బ్యాక్ రీమేక్ సినిమాలెందుకు.? స్ట్రెయిట్ సినిమాలే కావాలని అభిమానులు కోరుకోవడంలో తప్పేముంది.?
అతి చేస్తున్నదెవరు.?
నేను హర్టయ్యాను.. అలిగాను.. బుంగమూతి పెట్టాను అంటే కుదురుతుందా.? కుదరదుగాక కుదరదు.! ఆ అభిమానులే సినిమా చూడాలి.. ఆ అభిమానులే సినిమాని భుజానికెత్తుకోవాలి.
Also Read: పవన్ సాక్షిగా.! బాలయ్య నోట బండ్ల మంత్రం.!
రీమేక్ విషయమై ముందే ఓ క్లారిటీ ఇచ్చేస్తే అంత పెద్ద రచ్చ జరిగేది కాదేమో. సరే, అభిమానుల పేరుతో కొన్ని అసాంఘీక శక్తులూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న వైనం హరీష్ శంకర్‌కి తెలియదా.?
ఒక్క ఒక్క పెద్ద డౌటానుమానం వుందిక్కడ. పవన్ కళ్యాణ్ అభిమానినని చెప్పుకుంటూ, ఆ అభిమానుల ‘అతి’ నేపథ్యంలో హర్టయ్యానని హరీష్ శంకర్ చెప్పడమేంటి.?
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మీద హరీష్ శంకర్‌కి వున్న అనుమానంపై డౌట్లు వస్తున్నాయ్ కదా.? అయితే, అది మీ తప్పు కానే కాదు.!