Harish Shankar.. మా గుండెల్లో మేకులు దించొద్దు.. అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు దర్శకుడు హరీష్ శంకర్‌కి మొరపెట్టుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ని తిడుతున్నారు.
ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్‌ని అయితే తిట్టలేరు కదా.! పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చాలా రీమేక్స్ వున్నాయ్. ఈ మధ్యకాలంలో తీసుకుంటే, ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలూ రీమేకులే.
హరీష్ శంకర్ గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’ కూడా రీమేకే కదా మరి.!
Harish Shankar ‘తెరి’ రీమేక్ చేస్తారా.?
పవన్ కళ్యాణ్ ‘తెరి’ రీమేక్ చేయబోతున్నారన్నది చాలాకాలంగా ప్రచారంలో వున్న విషయం. అయితే, ఈ విషయమై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

హరీష్ శంకర్ మాత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ ఓ స్ట్రెయిట్ సబ్జెక్ట్ రాసుకుని వున్నాడు. అది గతంలోనే ప్రకటితమయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి వుంది.
రీమేకు వద్దు బాబోయ్..
సోషల్ మీడియా వేదికగా ‘మాకు రీమేక్ వద్దు’ అని మొత్తుకుంటున్నారు. హరీష్ శంకర్‌నీ, మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థనీ ట్యాగ్ చేస్తున్నారు.
ఏమో, ఈ సినిమా విషయమై పవన్ నిర్ణయం ఎలా వుంటుందో ప్రస్తుతానికైతే సస్పెన్స్. అన్నట్టు మధ్యలో ‘వినోదియ సితం’ రీమేక్ గురించి పవన్ (Pawan Kalyan) తీవ్రంగానే ఆలోచించారు. ఎందుకో అది పక్కకు వెళ్ళింది.
Also Read: మహేషూ.! మీ నాన్న కృష్ణ అంటే నీకు గౌరవం లేదా.?
ఓ వైపు రాజకీయాలు, ఇంకో వైపు సినిమాలు.. రెండిటినీ బ్యాలెన్స్ చేయడం పవన్ కళ్యాణ్‌కి కష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రీమేక్స్‌ని ఎంచుకుంటున్నారు.
కానీ, ఏ అభిమానుల కోసమైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమాలు చేస్తున్నారో, ఆ అభిమానులే ఇప్పుడు రీమేక్స్ వద్దంటున్నారు.
‘హరిహర వీరమల్లు’ రూపంలో స్ట్రెయిట్ సినిమా వున్నా, హరీష్ శంకర్ నుంచి కూడా స్ట్రెయిట్ సినిమానే పవన్ అభిమానులు ఆశిస్తుండడంలో తప్పేముంది.?