Home » ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై హరీష్ శంకర్ రిస్కీ స్టేట్మెంట్.!

‘ఉస్తాద్ భగత్ సింగ్’పై హరీష్ శంకర్ రిస్కీ స్టేట్మెంట్.!

by hellomudra
0 comments
Harish Shankar

Harish Shankar UBS Risky.. దర్శకుడు హరీష్ శంకర్ అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.! ఆ మాటకొస్తే, భక్తుడు.. అనొచ్చు.!

తన అభిమాన నటుడ్ని, దేవుడిలా చూస్తాడు హరీష్ శంకర్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత, మళ్ళీ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.!

అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేసి వుండేది.

ముందు అనుకున్న కథ వేరు, ఆ తర్వాత మారిన పరిస్థితులు వేరు. అలా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మొత్తానికి పూర్తయ్యింది, విడుదలకు సిద్ధమయ్యింది.

Harish Shankar UBS Risky.. అప్పట్లో భగత్ సింగ్ అలా..

అసలంటూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మీద అప్పట్లో ఎలాంటి అంచనాలూ లేవు. ఎందుకంటే, తమిళ సినిమా ‘తెరి’కి ఇది రీమేక్.. అన్న ప్రచారం వల్లనే.

విజయ్, సమంత కలిసి నటించిన సినిమా ‘తెరి’. అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ఓటీటీ పుణ్యమా అని తెలుగులోనూ అందుబాటులో వుందీ సినిమా.

అయితే, ‘తెరి’ కాదు, ఇది వేరే.. అని ఎన్నిసార్లు హరీష్ శంకర్ స్పష్టత ఇచ్చినా ఎవరూ నమ్మలేదు. ‘గబ్బర్ సింగ్’ కూడా రీమేకే. కాకపోతే, అందులో చాలా మార్పులు చేశాడు దర్శకుడు హరీష్ శంకర్.

‘మార్పులు – మాటలు – దర్శకత్వం’ అని హరీష్ శంకర్, తన పేరుని ‘గబ్బర్ సింగ్’ టైటిల్ కార్డ్‌లో వేసుకున్న సంగతి తెలిసిందే.

కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకొచ్చేసరికి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. హరీష్ శంకర్.. అనే పేరు కనిపిస్తోంది.

ఇంత క్లియర్‌గా తన పేరు వేసుకోవడమంటేనే, ఇది రీమేక్ సినిమా కాదని అర్థమంటూ హరీష్ శంకర్ తాజాగా స్పష్టం చేశాడు. హరీష్ శంకర్ మాటల్లో చాలా పెయిన్, అదే సమయంలో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది.

రీమేక్ పేరుతో హరీష్ శంకర్‌ని చాలామంది చాలా రకాలుగా హింసించారు సోషల్ మీడియా వేదికగా. అలా వేధించినవారిలో సాక్షాత్తూ పవన్ కళ్యాణ్ అభిమానులుగా చెప్పుకునే కొందరు నెటిజనం కూడా వున్నారు.

వివిధ కారణాల వల్ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కాస్త లేటవడం కూడా దర్శకుడు హరీష్ శంకర్‌కి కలిసొచ్చింది. స్క్రిప్ట్‌ని మరింత బలంగా డిజైన్ చేసుకున్నాడు.

అయితే, రీమేక్ కాదు.. అని చెప్పడమంటే, చాలా రిస్క్ చేసినట్లే దర్శకుడు హరీష్ శంకర్. ఎందుకంటే, రీమేక్ ఛాయలు ఏమైనా కన్పిస్తే, ఆ తర్వాత ట్రోలింగ్ వేరే లెవల్‌లో వుంటుంది మరి.!

అన్నట్టు, పవన్ కళ్యాణ్‌తో డాన్స్ చేయించడం అనేది తనకు మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన విద్య.. అంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.

పవన్ కళ్యాణ్ డాన్సుల విషయంలోనూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు పెంచేస్తున్నాడు దర్శకుడు. ఇంతకీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలా వుండబోతోంది.? ఈ నెలలోనే సినిమా విడుదల.. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group