Hasya Brahma Brahmanandam.. ఔను, నవ్వలేకపోవడం ఓ రోగం.! నవ్వితే చాలు ఎలాంటి బాధనైనా మర్చిపోగలం.! ‘హాయిగా నవ్వండి.. మీ గుండెను ఆరోగ్యంగా వుంచుకోండి’ అంటారు వైద్యులు.
నవ్వుకి వున్న గొప్పతనం అది. నవ్వడమంటే.. అర్థం పర్థం లేకుండా పగలబడి నవ్వేయడం కాదు. ఆనందంగా వుండడం.. సంతోషంగా వుండడం.. ఆ కారణంగా నవ్వడం.!
ఎన్ని బాధలు వున్నాసరే.. కాస్సేపు వాటిని మర్చిపోయి.. ఆనందంగా నవ్వగలిగితే.. అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది.?
నిజంగానే హాస్య బ్రహ్మ.!
తెలుగు సినీ కమెడియన్ బ్రహ్మానందం పేరు చెప్పగానే చాలామందికి నవ్వొస్తుంది. ఏ హాస్య నటుడికైనా అంతకన్నా గర్వకారణం ఇంకేముంటుంది.?
వందల కోట్లు.. వేల కోట్లు సంపాదన కంటే ఎక్కువ.. బ్రహ్మానందం సంపాదన.! ఔను, ఆయన సంపాదించుకున్నది కోట్లాది హృదయాల్ని. ఔను, చాలా హృదయాల్ని సరదాగా దొంగిలించిన చిలిపి దొంగ బ్రహ్మానందం. కొన్ని కోట్ల హృదయాల్ని కొల్లగొట్టారాయన తన నవ్వులతో.!
Mudra369
సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఫొటోతో వున్నన్ని మీమ్స్ బహుశా.. ప్రపంచంలో ఇంకెవరి ఫొటోతోనూ వుండవేమో.! ఆ హావభావాల తాలూకు గొప్పతనమది.
ఆ నవ్వుల బ్రహ్మానందం.. ఆ ‘హాస్యబ్రహ్మా’నందం పుట్టినరోజు.. అంటే, హాస్యానికే పండగ రోజు అని చెప్పక తప్పదేమో.!
Hasya Brahma Brahmanandam.. పనైపోయిందన్నారుగానీ..
తరచూ బ్రహ్మానందం పనైపోయిందని అంటుంటారు. బ్రహ్మానందం లాంటి గొప్ప కమెడియన్‌ని వాడుకోలేకపోవడం మన దర్శక నిర్మాతల దురదృష్టం.

బ్రహ్మానందాన్ని సరిగ్గా వాడుకోలేని చేతకానితనం అనాలే తప్ప, ఆయన పనైపోయిందని ఎలా అనగలం.? ఆయన హాస్య బ్రహ్మ.!
Also Read: పవన్ సాక్షిగా.! బాలయ్య నోట బండ్ల మంత్రం.!
ఎన్నో సినిమాల్ని ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చారు. ఆయా సినిమాల్లో హీరో కంటే బ్రహ్మానందం కామెడీనే హైలైట్ అయ్యేది. అదీ బ్రహ్మానందం అంటే.
తెలుగు తెరపై ఎందరో మహానుభావులు.! ఆ లిస్టులో బ్రహ్మానందం పేరు కూడా ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించబడి వుంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.
కొత్తగా ఎంతమంది కమెడియన్లు వచ్చినాసరే, బ్రహ్మానందానికి సాటి ఎవరూ రారంతే.!