HBD Sai Durgha Tej.. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకోవడం అంత తేలికైన విషయం కాదు. జరిగిన ప్రమాదం అంతటి తీవ్రమైనది మరి.!
మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో తమ మేనల్లుడి పరిస్థితి చూసి చలించిపోయారు.
ఎలాగైతేనేం, కోలుకున్నాడు.. చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యాడు. తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. తెరపై కనిపించగానే, ‘ఇదేంటి.. ఇలా అయిపోయాడు.?’ అంటూ బోల్డన్ని కామెంట్లు.
HBD Sai Durgha Tej.. ట్రోలింగ్ తప్పలేదుగానీ..
ట్రోలింగ్ సంగతి సరే సరి.! మాట సరిగ్గా రావట్లేదు.. సరిగ్గా, తెరపై కదల్లేకపోతున్నాడు.. అంటూ, అతని మీద బోల్డన్ని విమర్శలు.
పరిచయం అక్కర్లేని పేరది.. అతనే, సాయి ధరమ్ తేజ్. కాకపోతే, ఇప్పుడు పేరు మారింది.. సాయి దుర్గా తేజ్.! తల్లి పేరుని తన పేరులో చేర్చుకున్నాడు మెగా మేనల్లుడు.

రోడ్డు ప్రమాదం తర్వాత చేసిన సినిమా ‘విరూపాక్ష’ అయితే, ఇప్పుడు ఇంకో ప్రతిష్టాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కొత్త సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కండలు తిరిగిన దేహంతో సాయి ధరమ్ తేజ్.. అదేనండీ, సాయి దుర్గా తేజ్ కనిపిస్తున్నాడు.
పాన్ ఇండియా లెవల్..
కానీ, హీరో ఫేస్‌ని మాత్రం ఈ మేకింగ్ వీడియోలో రిలీజ్ చేయలేదు. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది కదా.. ఇది కూడా అదే తరహా సినిమా అనుకోవచ్చు.
‘మళ్ళీ ఇలా మీ ముందుకు వస్తానని అనుకోలేదు. ఇది నాకు పునర్జన్మ లాంటిదే..’ అని పలు సందర్భాల్లో చెప్పాడు సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్.
Also Read: వెట్రిమారన్‌తో తమిళంలోనే ఎందుకు ఎన్టీయార్.?
ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు సేవా కార్యక్రమాలు.. వెరసి, మేనమామల్లానే తానూ అందరివాడినని అనిపించుకుంటున్నాడీ మెగా మేనల్లుడు.
పుట్టినరోజు సందర్భంగా సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్‌కి విషెస్ అందిద్దాం. హ్యాపీ బర్త్ డే తేజూ.!