Heart Attack Politics.. గుండె పోటు – గొడ్డలి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిథి ఆయన.! చిత్రంగా, ఆయనగారి తల్లికి గుండె పోటు వచ్చిందట.
గుండె పోటు అనేది ‘చెప్పి’ రాదు కదా.! ఈయనగారికి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన తరుణంలో, తల్లిగారు గుండె పోటు తెచ్చుకున్నారట.
నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంది రాజకీయం.! ‘వేరే పన్లున్నాయ్.. బిజీగా వున్నాను.. విచారణకు రాలేను..’ అని ఇంతకు ముందు సీబీఐకి తేల్చి చెప్పిన ఘనుడాయన.
Heart Attack Politics.. నవ్వండ్రా బాబూ.!
అదేంటీ, సీబీఐ అందరికీ ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తుందా.? కుంటి సాకులు చెబుతోంటే, చూసి ఓ చిత్రమైన నవ్వు నవ్వి ఊరుకుంటుందా.?
ఇంతకీ, బాబాయ్ గుండె పోటుతో చనిపోయాడా.? దారుణంగా ఎవరో చంపేస్తే, చచ్చిపోయాడా.? అది తేల్చే పనిలోనే వుంది సీబీఐ.!
డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా, మృతుడికి అక్రమ సంబంధాలున్నాయంటాడు పాపం ‘పసివాడైన’ అబ్బాయ్.!
అంతకు ముందేమో, అదే బాబాయ్.. చాలా గొప్పోడు, సౌమ్యుడు కూడా.! వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, ఇదిగో.. ఇలాగే ఎవడైనా కథలు చెప్తాడు.!
Mudra369
సీబీఐ అంటే ఏంటి.? దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఓ మాజీ ప్రజా ప్రతినిథి, కీలక పదవులు వెలగబెట్టిన ప్రముఖ నాయకుడి హత్య కేసుని దర్యాప్తు చేస్తోంది సీబీఐ.
అలాంటి సీబీఐతో ఆటలాడుతున్నాడు, బాధ్యతగల ప్రజా ప్రతినిథి. తల్లికి గుండె పోటు వచ్చిందని, సీబీఐ విచారణ ఎగ్గొట్టి, సొంతూరికి పారిపోయాడట మహానుభావుడు.
పిల్లి వచ్చె.. ఎలక పారిపోయె.!
ఆయన్ని పట్టుకోవడం కోసం సీబీఐ బృందాలు ఆయన వెంట పరుగులు పెట్టాయట.
అరెస్టు చెయ్యొద్దంటూ కోర్టుకెళతాడాయన.. అరెస్టు చేయాల్సిందేనంటుంది సీబీఐ. కానీ, వచ్చిన అవకాశాల్ని సీబీఐ సద్వినియోగం చేసుకోదు.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
అంతా ఓ హైడ్రామా.! నవ్వుకున్నోడికి నవ్వుకున్నంత.! సీబీఐ విషయంలో ఛీ..బీ..ఐ.. అనే విమర్శలు ఊరికే రావు మరి.! అలా రాజకీయ నాయకులు, సీబీఐతో ఆటలాడుతున్నారు.
నడుస్తున్న వార్తా స్రవంతిని విశ్లేషిస్తే ఇలా అనిపించడం మామూలేగానీ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నమ్మాల్సిందే.! నమ్మకపోతే మీ.. మా.. మనందరి ఖర్మ.!