Table of Contents
ఎవరి జీవితం వారిష్టం. పెళ్ళి కబురు చెబితే, ‘శుభాకాంక్షలు’ చెప్పి ఊరుకోవడం బెటర్. సారీ, విడిపోతున్నాం.. అని చెబితే, లైట్ తీసుకోవడం బెటర్. సినీ రంగంలోనే కాదు, అన్ని చోట్లా లవ్, బ్రేకప్.. నిశ్చితార్థం.. పెళ్ళి పీటలెక్కేముందు పెళ్ళి ఆగిపోవడం.. పెళ్ళయ్యాక వెంటనే విడాకులు.. కొన్నాళ్ళ వైవాహిక జీవితం తర్వాత విడిపోవడం.. ఇవన్నీ మామూలే. సెలబ్రిటీల వ్యవహారాలకి (Heroienes Love Wedding Break Up Break Off) ఒకింత ఎక్కువ ‘హైప్’ క్రియేట్ అవుతుందంతే.
మెహ్రీన్ పెళ్ళి ఎందుకు ఆగిపోయింది.?
మెహ్రీన్ (Mehreen Kaur Pirzada), సినిమాల్లో కొనసాగాలనుకుందట.. దాన్ని, ఆమెకు కాబోయే భర్త ఒప్పుకోలేదట. ఇదొక గాసిప్. ‘ఆ కుటుంబంతో ఇకపై ఎలాంటి సంబంధాలుండవు..’ అని మెహ్రీన్ ప్రకటించేసింది.
Also Read: చేసినప్పుడు లేని సిగ్గు.. చూస్తే వచ్చిందా.?
కానీ, అవతలి వ్యక్తి మాత్రం, కాస్త సున్నితంగా బ్రేక్ ఆఫ్ విషయాన్ని వెల్లడించాడు. ఏం జరిగింది.? అనేది ఆ ఇద్దరు వ్యక్తులు, ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం.
మెహ్రీన్ కౌర్ పిర్జాదా మాత్రమే కాదు..
గతంలో త్రిష (Trisha Krishnan) కూడా పెళ్ళికి సిద్ధమయ్యింది.. పెళ్ళి ప్రకటన చేసింది. ఏమయ్యిందోగానీ, పెళ్ళి పీటలెక్కడానికి ముందే ఆ బంధం తెగిపోయింది. తిరిగి త్రిష సినిమాల్లో బిజీ అయిపోయింది. ఎందుకు పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది.? అన్న ప్రశ్నకు జస్ట్ నో కామెంట్.. అనేసింది త్రిష. ఆ తర్వాత చాలామంది ఆ విషయాన్నే మర్చిపోయారు.
రష్మిక మండన్న కూడా..
రష్మిక మండన్న (Rashmika Mandanna) కూడా పెళ్ళి చేసుకుని, సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామనుకుంది. తెలుగు సినిమాల్లోకి రాకముందే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తితో రష్మిక ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. కానీ, అది బ్రేక్ ఆఫ్ అయిపోవాల్సి వచ్చింది. పెద్ద రచ్చే జరిగింది. చివరికి అంతా సద్దుమణిగిపోయింది.
Also Read: హవ్వ.. అలాంటి ప్రశ్న ఆర్జీవీని అడిగితే ఎలా.?
రష్మిక ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, తమిళ, హిందీ సినీ పరిశ్రమలోనూ స్టార్ హీరోయిన్.. అనిపించుకుంటోంది.
లిస్టులో చాలామందే కనిపిస్తారిలా. కానీ, ప్రతిసారీ రచ్చ జరుగుతూనే వుంటుంది. బహుశా అదంతా దురభిమానం వల్లనే అనుకోగలమా.? సోషల్ మీడియా వుంది కాబట్టి, నోటికొచ్చిన కామెంట్లు చేసే అవకాశం వుంది కాబట్టి.. కామెంట్లు (Heroienes Love Wedding Break Up Break Off) పడుతుంటాయంతే.