‘ఓజీ’ వచ్చేస్తోంది.! డిప్యూటీ సీఎం కళ్యాణ్‌కి కల్ట్ చూపించాలె.!

 ‘ఓజీ’ వచ్చేస్తోంది.! డిప్యూటీ సీఎం కళ్యాణ్‌కి కల్ట్ చూపించాలె.!

Pawan Kalyan OG

Pawan Kalyan OG Update.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమాకి సంబంధించి ‘పవర్ పుల్ అప్డేట్’ వచ్చేసింది.

స్వయంగా పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), ‘ఓజీ’ సినిమా విషయమై అప్డేట్ ఇచ్చేశారు. త్వరలో సినిమా షూటింగ్‌కి హాజరవుతానని ఆయనే స్వయంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, క్షణం తీరిక లేకుండా ప్రజా సేవలో బిజీగా వున్న పవన్ కళ్యాణ్, అసలు సినిమాలకు టైమ్ కేటాయించగలరా.? అన్నదో మిలియన్ డాలర్ ప్రశ్న.

Pawan Kalyan OG Update.. ఇది నిజంగానే పవర్ అప్డేట్.!

కానీ, స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ‘ఓజీ’ సినిమాపై ‘వస్తుంది.. బావుంటుంది.. చూద్దురుగాని’ అని చెప్పారంటే, ‘ఓజీ’ షూటింగ్ త్వరలో పూర్తయిపోతుందనే కదా అర్థం.?

Pawan Kalyan OG
Pawan Kalyan OG

‘పిఠాపురం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, బోల్డంత బాధ్యతని నా భుజాల మీద పెట్టారు. మా పార్టీకీ, మా కూటమికి అఖండ మెజార్టీని అందించారు. డిప్యూటీ సీఎంగా కొన్ని పనులు వేగంగా చేయాలి కదా..’ అని చెప్పారు పవన్ కళ్యాణ్.

పిఠాపురంలో నిర్వహించిన ‘వారాహి’ సభ ద్వారా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభిమానులు, ‘ఓజీ’ ఎప్పుడొస్తుంది.? అనడిగితే, ‘ఇప్పుడు ఓజీ అంటే, క్యాజీ.. అంటారు..’ అని సరదాగా వ్యాఖ్యానించారు జనసేనాని.

డిప్యూటీ సీఎంగా చాలా పనులున్నాయ్..

‘రోడ్లను బాగు చేయాలి.. ముందైతే కనీసం గుంతలైనా పూడ్చాలి..’ అని చెప్పిన జనసేనాని, ఓ రెండు మూడు రోజుల సమయం షూటింగ్‌కి కేటాయిస్తానని నిర్మాతలకు చెప్పినట్లు వివరించారు.

‘నిర్మాతలూ నన్ను అర్థం చేసుకున్నారు. వాళ్ళకి మాటిచ్చాం కదా. సినిమా పూర్తి చేయాలి..’ అని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

‘ఓజీ’ సినిమాలో ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ప్రధాన తారాగణం.

Mudra369

ఇక, ‘ఓజీ’ సినిమాపై అప్డేట్ వచ్చేయడంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన నటుడికి ‘కల్ట్’ చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read: Iswarya Menon: అందమైన జలపాతం.!

డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నుంచి రానున్న తొలి సినిమాకి పవన్ కళ్యాణ్ అభిమానులు చూపించే ఆ ‘కల్ట్’ వేరే లెవల్లో వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

Digiqole Ad

Related post