HHVM Negative Review Mafia.. సినిమా చూసి ఎవడైనా రివ్యూ ఇస్తాడు.. సినిమా చూడకుండానే రివ్యూ ఇస్తే, అది కదరా కిక్కు అంటే.!
‘హరి హర వీర మల్లు’ సినిమా విషయంలో ప్రముఖ యూ ట్యూబ్ ఛానళ్ళు, ప్రముఖ వెబ్‌సైట్లు, ఈ ‘కిక్కు’ కోసం కక్కుర్తి పడ్డాయి.!
ఓ ప్రముఖ వెబ్ సైట్, తమ యజమాని మెప్పు కోసం ముందుగానే, ‘వై నాట్ 175’కి అనుగునంగా, ‘1.75’ రేటింగుతో టెంప్లేట్ రెడీ చేసుకుంది.
ఆనోటా, ఈనోటా ‘హరి హర వీర మల్లు’ సినిమాకి సంబంధించిన సినాప్సిస్ వినేసి, రాత్రికి రాత్రి, ‘1.75’ రేటింగుతో రివ్యూ వదిలేసింది.
HHVM Negative Review Mafia.. సినిమాపై కుల జాడ్యం..
మామూలుగా అయితే, సినిమా విడుదల రోజు, మధ్యాహ్నం 2 గంటల తర్వాతగానీ, ఆ వెబ్‌సైట్‌లో రివ్యూ రాదు. కుల జాడ్యం, ఆపై రాజకీయ పక్షపాతం.. ‘గే’ట్ వెబ్‌సైట్ పైత్యానికి కారణం.
ఇలా పైత్యం ప్రదర్శించినందుకుగాను, ఆ ‘గే’ట్ వెబ్‌సైట్‌కి దక్కిన ‘పేటీఎం కూలీ’ జస్ట్ లక్షా డెబ్భయ్ ఐదు వేలు.! ఓహ్, ఇక్కడ కూడా 175 నెంబర్లు వున్నాయ్ కదా.! వైనాట్ 175 మరి.!
Also Read: వాళ్ళకి సమస్య హిందీతో కాదు, పవన్ కళ్యాణ్‌తో.!
మొత్తంగా చూస్తే, ‘హరి హర వీర మల్లు’ మీద నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వెబ్‌సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్ళు బాగానే జేబులు నింపుకున్నాయి.
ఎన్నికల వేళ ఓటర్లను కొనేందుకు డబ్బుల్ని వెదజల్లడం మామూలే.
అదేంటో, పవన్ కళ్యాణ్ కారణంగా చావు దెబ్బ తిన్న ఓ రాజకీయ పార్టీ, ‘హరి హర వీర మల్లు’ సినిమాకి నెగెటివ్ రివ్యూల కోసం కోట్లు ఖర్చు చేసింది.
కుట్ర ఎప్పుడో మొదలైంది..
సినిమా అటకెక్కేసిందనీ.. అసలు విడుదల కాదనీ.. తొలుత దుష్ప్రచారం చేశారు. తీరా, విడుదలకు సిద్ధమయ్యాక, సినిమాకి బిజినెస్ అవలేదంటూ మరో దుష్ప్రచారానికి తెరలేపారు.
‘హరి హర వీర మల్లు’ సినిమాకి వ్యతిరేకంగా ఓ పెద్ద మాఫియానే పని చేసింది గత కొద్ది రోజులుగా.
ఈ దుష్ప్రచారం కోసం.. పెద్ద మొత్తంలో.. లక్సల్లో కాదు, అంతకు మించి.. ఎందుకు ఖర్చు చేశారన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఇదే పైత్యం, పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ‘ఓజీ’పై దుష్ప్రచారం చేయడానిీక ప్రదర్శించబోతున్నారు. అప్పుడూ ఇదే జాడ్యం తప్పదనుకోండి.. అది వేరే సంగతి.
