బిగ్‌బాస్ సీజన్ 3 డే వన్ నుండీ అగ్రెసివ్‌గానే సాగుతోంది. తమన్నా ఎంట్రీతో కాస్త డిస్ట్రబ్ అయిన హౌస్, ఆమె ఎలిమినేషన్‌తో (Himaja Ashu Reddy) మళ్లీ మొదటికొచ్చింది. అయితే, మూడో వారం కాస్త డల్‌గా అనిపించిన బిగ్ హౌస్ నాలుగో వారంలో పుంజుకుంది. హోస్ట్ నాగార్జున ఇచ్చిన అవార్డులే దీనికి కారణం.
ఈ అవార్డులు హౌస్‌లో కొంత కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. దాంతో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ లెవల్స్ మెల్లగా పెరిగాయి. ఆ క్యూరియాసిటీని అలాగే కొనసాగించేందుకు బిగ్‌బాస్ కూడా హౌస్ మేట్స్ మధ్య పుల్లలు పెట్టే దిశగా టాస్క్‌లు ఇచ్చాడు.
Click Here: బిగ్ వైల్డ్ కార్డ్: ఈషా రెబ్బ.? శ్రద్ధాదాస్.?
ఇదిలా ఉంటే, ఇక ఎలిమినేషన్ వీక్ వచ్చేసింది. ప్రతీ వారం ఎలిమినేషన్ వీక్ ఆసక్తిగానే నడుస్తోంది. అయితే, ఈ సారి ఇంకాస్త ఆసక్తి నెలకొంది. రాహుల్, బాబా భాస్కర్, శివజ్యోతి, హిమజ, ఆషూ, పునర్నవి, మహేష్ ఈ ఏడుగురూ ఈ సారి ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు.
వీరిలో హిమజ, ఆషూరెడ్డిలకు హౌస్ నుండి బయటికి వేళ్లేందుకు ఎడ్జ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. హిమజతో పోల్చితే, ఆషూకి ఓట్లు తక్కువ వచ్చాయనీ ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
అయితే, హౌస్‌లో హిమజ హద్దులు దాటేస్తోందనే అభిప్రాయాలు ఆడియన్స్‌లో ఉన్నాయి. సీక్రెట్ టాస్క్‌కి సంబంధించి, హిమజ ఓవరాక్షన్ చేసింది. కానీ, టాస్క్ ఫెయిలైంది. దాంతో ఇమ్యూనిటీ పొందే అవకాశం కోల్పోయింది.
ఇక ఆషూ రెడ్డి, ఇంతవరకూ హౌస్‌లో కాస్త డల్‌గా ఉంటూ వచ్చింది. కానీ అనూహ్యంగా ఈ మధ్య స్పీడు పెంచింది. కొన్ని కాంట్రవర్సీలకు తాను కూడా కేంద్రబిందువవుతోంది. దాంతో తను కూడా హౌస్‌లో ఉన్నానన్న నమ్మకం కలిగించింది ఆడియన్స్‌కి. సోషల్ మీడియా పరంగా హిమజతో (Himaja Ashu Reddy) పోల్చితే, ఆషూకి కొంచెం ఎక్కువ ఫాలోయింగే ఉంది.
అయినా, కానీ, ఆమె డల్ నేచర్‌తో ఓట్ల పరంగా అషు రెడ్డి కాస్త వెనకబడిందట. కానీ, ఇంతవరకూ జరిగిన ఎలిమినేషన్స్ ఓట్లతో సంబంధం లేకుండా జరుగుతోంది. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ల కన్నా, ఆ తర్వాతి వారిని ఎలిమినేట్ చేస్తున్నారు.
ఇంతవరకూ జరిగిని ఎలిమినేషన్స్ అన్నీ అలాగే జరిగాయి. లాస్ట్ వీక్ ఎలిమినేషన్లో రోహిణి కన్నా, శివజ్యోతికి తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ, రోహిణిని ఎలిమినేట్ చేశారు. ఆ ఈక్వేషన్స్‌తో ఆషూని ఉంచేసి, హిమజని ఎలిమినేట్ చేస్తారా.? ఏమో లెట్స్ వెయిట్ అండ్ సీ.!