Honey Trap On MLA.. ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నది చాలక, చావు దెబ్బ కొట్టిన పార్టీ మీద నిస్సిగ్గుగా కుట్రలకు తెరలేపింది ఓ రాజకీయ పార్టీ.!
అధికారం కోల్పోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయిన ఆ ‘క్రిమినల్ పార్టీ’, అత్యంత నీఛానికి తెగబడింది. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే మీద ఓ మహిళతో ‘హనీ ట్రాప్’కి ప్లాన్ చేసింది.
‘అతను ఐ లవ్ యూ అని పెడితే.. నేనూ ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టాను.. తప్పేంటి.?’ అంటూ, సదరు మహిళ, ప్రెస్ మీట్‌లో అడ్డంగా దొరికిపోయింది.
‘మా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, విషెస్ చెప్పడానికి ఫేస్ బుక్ ద్వారా కాంటాక్ట్ అయ్యాను.. గంటల తరబడి మాట్లాడాను’ అని కూడా సెలవిచ్చింది ఆమె.
పెళ్ళయి.. పిల్లలు కూడా వుండి.. దిగజారిపోయింది.!
పెళ్ళయి, పిల్లలుండి కూడా.. భర్తకు దూరంగా వున్న ఆ మహిళ, సదరు ఎమ్మెల్యేని ‘ట్రాప్’లోకి లాగిందంటే, ఎంత ‘కిలేడీ’నో అర్థం చేసుకోవచ్చు.
‘నేనేమీ తప్పు చేయలేదు’ అని సదరు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. కానీ, ఆ కిలేడీ మాత్రం, ఓ జర్నలిస్టుని తానే బంధించి, టార్చర్ పెట్టినట్లు, ప్రెస్ మీట్‌లో నిర్లజ్జగా చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలో, ‘నేనే వాడికి 7 లక్షలు ఇచ్చా’ అని చెప్పిందంటే, ఏ స్థాయికి దిగజారిందో ఆ కిలేడీ అర్థం చేసుకోవచ్చు.
పక్కా ప్లానింగ్‌తో ఓ ట్విట్టర్ హ్యాండిల్‌కి లక్షలు ధార పోసి, ‘బ్రేకింగ్ న్యూస్’ డిజైన్ చేశారు. ఓ రాజకీయ పార్టీ, తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా దుష్ప్రచారానికీ తెగబడింది.
కిలేడీ కట్టు కథ..
కట్ చేస్తే, ఆ కిలేడీ.. ప్రెస్ మీట్‌లో అడ్డంగా దొరికేసింది. ఇప్పడా ఎమ్మెల్యే ముందున్న ఆప్షన్స్ ఏంటి.? న్యాయ పోరాటం చేయడమొక్కటే.!
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కలకం సృష్టించిన ఈ హనీ ట్రాప్ వ్యవహారం.. దీనికి ఓ రాజకీయ పార్టీ కుట్ర పన్నిన వైనం.. ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది.
ఒక్కమాటలో చెప్పాలంటే, సదరు రాజకీయ పార్టీ తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లయ్యిందిప్పుడు.!
ఆ రాజకీయ పార్టీ పేరు, ఆ మహిళ పేరు, ఆ ఎమ్మెల్యే పేరు.. ప్రస్తావించడం నైతికత అనిపించుకోదు కాబట్టి.. వివరాలు వెల్లడించడంలేదు.
పెద్ద కామెడీ ఏంటంటే, జస్ట్ పదిహేను నెలల వ్యవధిలో ఏకంగా ఐదు సార్లు అబార్షన్ చేయించుకున్నానని సదరు కిలేడీ చెప్పడం.
