Hrithik Roshan.. సిక్స్ ప్యాక్ అంటే ఒకప్పుడు హాలీవుడ్ హీరోలు గుర్తుకొచ్చేవారు.! కానీ, ఇప్పుడు సీన్ మారింది. సినిమాల్లో హీరో అవ్వాలంటే, సిక్స్ ప్యాక్ వుందా.? అని అడిగేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మొదటి నుంచీ ఫిట్నెస్ విషయలో తనకు తానే సాటి.. అని నిరూపించుకుంటూ వస్తున్నాడు. కొత్త జనరేషన్ హీరోల నుంచి ఎంత పోటీ వస్తున్నా, తగ్గేదే లే.. అంటున్నాడు.!
నిజానికి, హృతిక్ కంటే సీనియర్లయిన ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటోళ్ళు కూడా తగ్గడంలేదు. టైగర్ ష్రాఫ్ లాంటోళ్ళ సంగతి సరేసరి.
Hrithik Roshan.. ఎవరు ఏం చేసినా.. హృతిక్ రూటే సెపరేటు..
కండలు తిరిగిన శరీరం.. అంటే ముందుగా హృతిక్ రోషన్, ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ పేర్లే వినిపిస్తుంటాయి. ఇద్దరూ ఒక్కోసారి గురు శిష్యుల్లా కనిపిస్తుంటారు.

తాజాగా, హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో విడుదల చేశాడు. అది చూసి, హృతిక్ అభిమానులే కాదు.. సగటు సినీ అభిమానులు.. అందునా ఫిట్‌నెస్ లవర్స్ షాక్ అవుతున్నారు.
హతిక్ వయసు 48 ఏళ్ళు. ఈ వయసులో ఈ ఫిజిక్.. నిజంగానే ఓ వండర్ అనుకోవాలేమో.!
ట్రోలింగ్ కూడా అదే స్థాయి..
ఇంకోపక్క హృతిక్‌పై ట్రోలింగ్ కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. మరీ అంతలా ఎండిపోయావేంటి గురూ.? నువ్వు మనిషివా.? లేదంటే జస్ట్ స్కెలిటన్‌వా.? అని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.
Also Read: యెడ్డి యెంకటి ‘నీలి’ క్షుద్ర పాత్రికేయం.!
టాలీవుడ్‌లో అయితే, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగశౌర్య, నితిన్.. ఇలా ఎవరూ తగ్గడంలేదు. ఫిజిక్ విషయంలో మాత్రం ఫుల్ మార్క్స్ రామ్ చరణ్‌కే ఇచ్చెయ్యాలేమో.!