Hyper Aadi Janasena.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ.? హైపర్ ఆది ఎక్కడ.! పులివెందులలో జనసేన పార్టీ తరఫున హైపర్ ఆది పోటీ చేయడమేంటి.?
సోషల్ మీడియా వేదికగా ఓ జనసేన నేత రాయపాటి అరుణ ‘పవన్ కళ్యాణ్‌గారు ఆదేశిస్తే జగన్ మీద పోటీ చేస్తా..’ అంటూ ఆది చెప్పినట్లుగా ఓ పోస్ట్ పెట్టారు.
పవన్ కళ్యాణ్‌ని ఓడించేస్తా.. అని సినీ కమెడియన్ అలీ అన్నట్లుగా.. వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది.. అలీ ఆ మాట అనకపోయినా. ఇప్పుడు ఆది విషయంలోనూ అదే జరుగుతోంది.
జగన్‌కి డిపాజిట్లు రానివ్వనంటూ ఆది చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారు జనసేన మద్దతుదారులు.. కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అంటే ఇదేనేమో.
Mudra369
దాంతో, ఒక్కసారిగా అంతా షాక్‌కి గురయ్యారు. హైపర్ ఆది ఏంటి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పోటీ చేయడమేంటి.? అని చర్చించుకుంటున్నారంతా.
Hyper Aadi Janasena.. అలీ వర్సెస్ హైపర్ ఆది
ఏం.? పవన్ కళ్యాణ్ మీద పోటీకి సిద్ధం.. అని అలీ చెప్పగా లేనిది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హైపర్ ఆది చెబితే.. అందులో వింతేముంది.?

రాజకీయాల్లో గెలుపోటములనేవి చిత్ర విచిత్రంగా వుంటాయ్. అనామకుడు గెలిచేస్తుంటాడు.. రాజకీయ పండితుడు ఓడిపోతుంటాడు కూడా.!
కుక్క కాటుకి చెప్పు దెబ్బ..
జనసేన మీద వైసీపీ బురదచల్లుడు కార్యక్రమంలో భాగంగా, వైసీపీ అనుకూల మీడియా వేదికగా, పవన్ కళ్యాణ్ పాపులారిటీ తగ్గించేందుకు చిత్ర విచిత్రమైన బ్రేకింగ్ న్యూస్‌లు వస్తుంటాయ్.
Also Read: Money For Sale.. ఇచ్చట డబ్బులు అమ్మబడును.!
వాటికి విరుగుడుగా.. జనసేన సోషల్ మీడియా మద్దతుదారులు కూడా అదే బాటలో పయనిస్తున్నట్టున్నారు.
అలా హైపర్ ఆది, జగన్ మీద పోటీ చేస్తారన్న ప్రచారం తెరపైకి వచ్చి వుండొచ్చు.
ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. ఈ డిస్కషన్ సీరియస్ అయితే, ఆది రిస్క్ చేస్తాడేమో.! పోరాడితో పోయేదేముంది.?