Ileana D Cruz Adventure.. అందాల భామ ఇలియానా తల్లి కాబోతోందిట.! ‘And So The Adventure Begins’ అంటూ సోషల్ మీడియాలో ఓ పొటో పోస్ట్ చేసింది ఇలియానా.!
చిన్న పిల్లలు ధరించే డ్రెస్ ఓ ఫొటోలో (ఆ ఫొటో మీదనే ‘And So The Adventure Begins’ అనే ట్యాగ్), మరో ఫొటోలో ‘మామా’ అంటూ ఓ పెండెంట్ వున్నాయ్.!
”Can’t wait to meet you my little darling” అని పేర్కొంటూ ఇలియానా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.
“Welcome soon to the world of my new grand baby.. can’t wait” అంటూ ఇలియానా తల్లి కూడా స్పందించింది.
Ileana D Cruz Adventure.. ఇంతకీ, విషయం ఏంటబ్బా.?
ఇలియానా నిజంగానే తల్లి కాబోతోందా.? ఏమో, అదే నిజమేమో.! ఇలియానా తల్లయితే, ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరబ్బా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.
పాడు సమాజం.. ఇలా ప్రశ్నిస్తుందేంటీ.! అంటే, అదంతే.! సరోగసీ మార్గంలో ఇలియానా తల్లి కాబోతోందన్నది ఓ ప్రచారం.
ఏమో, అసలు విషయం ఏంటన్నదానిపై పూర్తి స్పష్టత రావాల్సి వుంది. కొన్ని రోజులు ఆగితే, ఇలియానానే అసలు విషయం బయట పెట్టేయొచ్చు.
తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమలో ఇలియానా బోల్డన్ని సినిమాలు చేసేసింది, మంచి స్టార్‌డమ్ కూడా దక్కించుకుంది.
Also Read: ప్రియాంక మోహన్.! వద్దు బాబోయ్.!
అన్నట్టు, ఇలియానా ఈ మధ్యనే ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించిన సంగతి తెలిసిందే.
కొన్నాళ్ళ క్రితం ఆండ్రూ నీబోర్న్ అనే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌తో సహజీవనం చేసింది ఇలియానా. చాలాకాలం సహజీవనం తర్వాత, అతనితో బ్రేకప్ అయిపోయిందామెకి.!