Meera Chopra Ignores Jr NTR: నటి మీరా చోప్రా గుర్తుందా.? పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ సినిమాలో కనిపించింది.. ఆ తర్వాత నితిన్ సరసన కూడా ఓ సినిమా చేసింది.. కానీ, తెలుగు తెరపై నిలదొక్కుకోలేకపోయింది.
సినీ రంగంలోకి వచ్చినోళ్ళంతా రాణించెయ్యాలనే రూల్ ఏమీ లేదిక్కడ. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. లక్కు కూడా కలిసి రావాలి.
సరే, ఈ మీరా చోప్రా గురించిన ప్రస్తావన ఇప్పుడెందుకంటే, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు తమ అభిమాన హీరోని ఆవిడగారు గుర్తించడంలేదని తెగ బాధపడిపోతున్నారు.
Meera Chopra Ignores Jr NTR.. ఎన్టీయార్‌ని మీరా చోప్రా ఎందుకు గుర్తించాలి.?
ఎన్టీయార్‌ని మీరా చోప్రా గుర్తించలేదనే బాధా.? లేదంటే, ప్రభాస్ అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ తదితరుల్ని పాన్ ఇండియా హీరోలుగా ఆమె గుర్తించిందనే అక్కసా.? యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులెందుకు ఇంత ‘చీపు’గా ఆలోచిస్తున్నారబ్బా.? అన్న చర్చ జరుగుతోంది.
సరే, అభిమానులంటేనే అంత. మీరా చోప్రా (Meera Chopra) తెలుగు సినిమాలు చేయడం లేదిప్పుడు. పైగా, గతంలో ఆమెను దారుణంగా యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు దుర్భాషలాడారు.
బహుశా ఆ మంట ఆమెకు ఇంకా తగ్గినట్టు లేదు. అందుకే, ఎన్టీయార్‌ని (Young Tiger NTR) పక్కన పడేసి వుండొచ్చు. లేదా, ఆమె దృష్టిలో ఎన్టీయార్ పాన్ ఇండియా హీరో అయి వుండకపోవచ్చు.
మీరా చోప్రా సర్టిఫికెట్ లేకపోతే, ఎన్టీయార్‌కి గుర్తింపు లేదా.?
ఎన్టీయార్ అభిమానులు.. ఇతర హీరోల గొప్పని గుర్తిస్తారా.? గుర్తించరు కదా.! మీరా చోప్రా కూడా అంతేనని సరిపెట్టుకోవచ్చు కదా.?
ఈ మొత్తం వ్యవహారంలో ఎన్టీయార్ అభిమానులు చిత్రంగా రామ్ చరణ్‌ని (Mega Power Star Ram Charan) ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) మీదా మండిపడుతున్నారు. ప్రభాస్ (Rebel Star Prabhas) పైనా అక్కసు వెల్లగక్కుతున్నారు.
ఎన్టీయార్ అభిమానులే ఇదంతా చేస్తున్నారా.? వారి పేరుతో ఇంకెవరైనా రచ్చ చేస్తున్నారా.? అన్న అనుమానాలూ లేకపోలేదు.
Also Read: Priyanka Jawalkar.. కిరికెట్టూ.. కనికట్టూ ఏంటో ఆ సీక్రెట్టూ.!
ఎన్టీయార్ పాన్ ఇండియా హీరో. అందులో డౌటేముంది.? ఎవరు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీయార్ నటనకు అంతా ఫిదా అయ్యారు.
అలాంటి ఎన్టీయార్ స్థాయిని దిగజార్చేందుకే ఎన్టీయార్ అభిమానులే ప్రయత్నిస్తున్నట్టుంది. లేకపోతే, ఎన్టీయార్‌ని మీరా చోప్రా (Meera Chopra) గుర్తించాలని ఎన్టీయార్ అభిమానులు దేబిరించడమేంటి.?