Ileana D Cruz Bump.. ఆ ఒక్కటీ అడగొద్దు.! ప్రస్తుతానికి ఇదే సమాధానం.! బెల్లీ బ్యూటీ ఇలియానా.. తన కడుపులో ఓ బిడ్డను మోస్తోంది. తాజాగా ఆ బేబీ బంప్‌ని కూడా ప్రదర్శించింది.!
ఇంతకీ, ఇలియానాని (Ileana D Cruz) ఏ ప్రశ్న అడగకూడదు.? ఇంకే ప్రశ్న.. ఆ కడుపులో వున్న బిడ్డకు తండ్రి ఎవరు.? అని.!
పాత చర్చే మళ్ళీ మళ్ళీ ఎందుకు.? ఎందుకంటే, ఇలియానా సోషల్ మీడియా వేదికగా ‘బేబీ బంప్’ పేరుతో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోంది గనుక.!
Ileana D Cruz Bump.. బంప్ సోయగం సరేగానీ..
‘బేబీ బంప్ చూపిస్తున్నావ్ సరే.. ఇంతకీ, ఆ బిడ్డకు తండ్రెవరో చెప్పవా.?’ అంటూ అభిమానులే నేరుగా, ఇలియానాని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేస్తున్నారు.
గోవా బ్యూటీ ఇలియానా (Ileana D Cruz) మనసులో ఏముందో.. ఆమె ‘పొట్టలో’ ఎలాంటి రహస్యం పెరుగుతోందో ఏమో.!
Also Read: Rakul Preet Singh.. రెమ్యునరేషన్‌పై రకుల్ హీరోయి‘నిజం’.!
అన్నట్టు, ఇలియానా (Ileana D Cruz) క్లోజ్ ఫ్రెండ్స్‌కి మాత్రం అన్నీ తెలుసట. వాళ్ళు మాత్రం అస్సలు రివీల్ చేయడంలేదు.. ఇలియానా బేబీ బంప్ వెనుక రహస్యాన్ని.!

నిజమే మరి.. రహస్యాన్ని లీక్ చేసేస్తే.. అదసలు రహస్యమెలా అవుతుంది.? ఇలియానా పెళ్ళయిపోయిందనీ.. త్వరలోనే ఆ విషయాన్ని ఇలియానా స్వయంగా వెల్లడిస్తుందనీ ఓ ప్రచారం తెరపైకొచ్చింది.