Ileana Son Koa Phoenix.. నటి ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకుని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది ఇలియానా.!
ఇలియానా కొడుకు పేరు కోవా ఫోనిక్స్ డోలన్.! ఆగస్ట్ 1న ‘కోవా’ జన్మించినట్లు ఇలియానా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
‘మా ప్రియమైన అబ్బాయిని పరిచయం చేస్తున్నా.. మా హృదయాల్ని దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత సంతోషంగా వున్నామో మాటల్లో చెప్పలేం..’ అంటూ ఇలియానా పేర్కొంది.!
Ileana Son Koa Phoenix.. ఇలియాని బిడ్డకు తండ్రి ఎవరు.?
ఇలియానాకి అసలెప్పుడు పెళ్ళయ్యింది.? ఆమె భర్త ఎవరు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
కొన్నాళ్ళ క్రితం సోషల్ మీడియా వేదికగా ఇలియానా ఓ ఫొటోని షేర్ చేసింది. అందులో, ఓ వ్యక్తి కనిపించీ, కనిపించకుండా వున్నాడు.

అతనే, ఇలియానా భర్త. అంతలా తన భర్త గురించి సుదీర్ఘంగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది ఆ ఫొటోతోపాటుగా ఇలియానా.
అయితే, ఇంతవరకు ఇలియానా, తన భర్త పేరుని వెల్లడించలేదు. తనయుడు పుట్టిన నేపథ్యంలో అయినా, ఇలియానా తన భర్తని పరిచయం చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఏమో, ఇలియానా భర్త.. ఈ పబ్లిసిటీ ప్రపంచానికి దూరంగా వుండాలనుకుంటున్నాడేమో.! అసలు వీళ్ళ పెళ్ళి ఎప్పుడయ్యిందన్నదీ ఎవరికీ తెలియని విషయం.