Table of Contents
ఇలియానా (Ileana D Cruz About Marriage and Love) పెళ్ళయిపోయిందట.. ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అట.. ఇలియానాకి తెలుగు సినిమాలంటే అస్సలు ఇష్టం లేదట.. ఇలియానాకి పొగరెక్కువయ్యిందట.. ఇలియానా అలాగట, ఇలియానా ఇలాగట… ఇలియానా ఇంకెలాగోనట.! ఇలా అందాల భామ ఇలియానా గురించి ఏవేవో పుకార్లు ఎప్పటికప్పుడు షికార్లు చేస్తూనే వున్నాయి.
తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో కలిసి ఇలియానా పలు ఫొటోల్లో దర్శనమిచ్చింది. బాలీవుడ్‌లో పలు పార్టీస్‌లోనూ ఇద్దరూ కలిసి హల్‌చల్ చేశారు. కానీ, ఆ ‘స్నేహం’ ప్రేమగా మారిందా.? పెళ్ళికి దారి తీసిందా.? అంటే మాత్రం, ఇలియానా ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడంలేదు. దటీజ్ ఇలియానా.
అసలేంటి కథ.? అని ఎంత గుచ్చి గుచ్చి అడిగినా, ఇలియానా నోట ఒక్కటే మాట వస్తుంది. ‘అది నా పర్సనల్’ అని. అవును, ఇలియానా తన వ్యక్తిగత జీవితం గురించి పెదవి విప్పేందుకు అస్సలేమాత్రం సుముఖత వ్యక్తం చేయదు. ‘పర్సనల్ లైఫ్ అంటే, పర్సనల్‌గానే వుండాలి.. దాన్ని బహిర్గతం చేయడం నాకిష్టం లేదు..’ అని ఇలియానా ఇంకోసారి తేల్చి చెప్పేసింది.
టాలీవుడ్ అంటే అయిష్టమా.?
‘తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు చాలామంది స్నేహితులు తెలుగు సినీ పరిశ్రమలో వున్నారు. నేనెందుకు, తెలుగు సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడతాను.? నన్ను స్టార్‌గా మార్చిందే తెలుగు సినిమా..’ అని తెలుగు సినిమాపై తనకున్న మమకారాన్ని చాటుకుంది ఇలియానా (Ileana D Cruz). ‘కొన్ని కథలు నచ్చక చేయలేదు, ఇంకొన్ని కథలు నచ్చినా.. ఆ సమయానికి ఏదో ఒక బాలీవుడ్ సినిమా చేస్తుండడం వల్ల, డేట్స్ అడ్జస్ట్ చేయలేక తెలుగు సినిమాల్లో నటించడానికి కుదరలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది నాజూకు నడు బ్యూటీ.
అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందని.?
అప్పటికీ ఇప్పటికీ ఇలియానా చాలా మారిపోయింది. ఫిట్‌నెస్ విషయానికొస్తే, ఎందుకో ఫిట్‌నెస్ వదిలేసి, బొద్దుగా తయారైపోయింది. ఇదే ప్రశ్న ఇలియానా ముందుంచితే, అదసలు పెద్ద సమస్యే కాదని తేల్చి చెప్పింది. ‘దేవదాసు’ సినిమా చేసేటప్పటికి తన వయసు చాలా తక్కువనీ, ఇప్పుడు 30 ఏళ్ళ పైబడిన వయసులో తాను చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నానని ఇలియానా చెప్పుకొచ్చింది. స్టార్‌డమ్‌తోపాటే బాధ్యతలు పెరుగుతాయి గనుక, ఒక్కోసారి మంచి కథల్నీ జడ్జ్ చేయడంలో ‘అతి జాగ్రత్త’ ఇబ్బందులు పెడుతుందని ఈ బ్యూటీ అభిప్రాయపడింది.
పెళ్ళి, ప్రెగ్నెన్సీ.. ఇలియానా ఏం చెప్పిందంటే.! (Ileana D Cruz Wedding)
‘ఆండ్రూ నాకు మంచి స్నేహితుడు. అంతకు మించి అతని గురించి ఇంకేమీ చెప్పలేం. మేం, ఇప్పుడు ఏ రిలేషన్‌లో వున్నామో, అది చాలా బాగుంది. నాకు ప్రెగ్నెన్సీ అంటూ ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి విషయాలపై మాట్లాడాల్సి రావడం కొంచెం బాధ కలిగిస్తుంటుంది. నా పర్సనల్ విషయాలపై గాసిప్స్ రావడం, వాటిని జీర్ణించుకోవాల్సి రావడం బాధాకరమే..’ అని ఇలియానా (Ileana D Cruz Wedding) తన మీద వచ్చే గాసిప్స్‌పై క్లారిటీ ఇచ్చినట్లే కన్పించినా, కన్‌ఫ్యూజన్‌ని మాత్రం కొనసాగించింది.
తెలుగు సినిమా చాలా మారిందట
తెలుగు సినిమా చాలా చాలా మారిపోయిందని ఇలియానా అభిప్రాయపడింది. ప్రచారం విషయంలో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోందనీ, స్టార్లు తమ సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న తీరు ఆహ్వానించదగ్గ విషయమని ఇలియానా (Ileana D Cruz About Marriage and Love) చెప్పింది.
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా ప్రమోషన్ కోసం హైద్రాబాద్‌కి వచ్చిన ఈ బ్యూటీ, తన మీద వస్తున్న గాసిప్స్ అన్నిటికీ దాదాపు క్లారిటీ ఇచ్చినట్లే అనుకుంటోందేమోగానీ.. అస్సలేమాత్రం ఆమె నుంచి సరైన స్పష్టత రాలేదాయె.!