Table of Contents
ఇల్లీ బేబ్ తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెబుతోంది తెలుసా? విశ్వనటుడు కమల్‌హాసన్ కుమార్తె అక్షర హాసన్, ‘లీక్డ్ పిక్స్’తో గుస్సా అవుతోంది పాపం. ఇద్దరు అందాల భామలు హాట్ హాట్‌గా వార్తల్లోకెక్కేశారు. అసలేంటి సంగతి? తెలుగులో డబ్బింగ్ చెప్పడం నాన్ తెలుగు బ్యూటీస్‌కి కొత్తేమీ కాదు. లీక్డ్ పిక్స్ ఉదంతాలు అందాల భామల విషయంలో ఓల్డ్ ట్రెండే. ఇలియానా డబ్బింగ్ సంగతులు, అక్షర హాసన్ హాట్ పీక్స్ లీక్ (Ileana D Cruz Aksharaa Haasan Leaks) అయిన వైనం గురించి వివరంగా తెలుసుకుందాం.
ఇలియానా.. తెలుగులోనా!
హీరోయిన్‌గా కెరీర్ ముగిసిపోయిందని అందరూ ఇలియానా (Ileana D Cruz) గురించి అనుకుంటున్న తరుణంలో, పిలిచి మరీ ఆమెకు అవకాశమిచ్చాడు దర్శకుడు శ్రీను వైట్ల. అది దర్శకుడి ఛాయిస్సేనా.? లేదంటే, హీరో రవితేజ గతంలో ఇలియానాతో వున్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆమెను ప్రిఫర్ చేశాడా.? అన్న విషయాల్ని పక్కన పెడితే, ఈ నాజూకు నడుము సుందరి బాగా బొద్దుగా తయారైపోయి, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా కోసం ఓకే చెప్పేయడమే పెద్ద సంచలనం. దానికి తోడు, ఇప్పుడీ బ్యూటీ తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పేసింది.
వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘దేవదాసు’ సినిమాతో ఇలియానా, తెలుగు తెరకు పరిచయమైంది. రామ్‌కి కూడా అదే తొలి సినిమా. హీరోగా రామ్, హీరోయిన్‌గా ఇలియానా తెరంగేట్రం చేసిన ‘దేవదాసు’ అప్పట్లో మంచి విజయమే సాధించింది. అప్పట్లో ఇలియానా హాట్ అప్పీల్‌కి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు పోటెత్తాయి. ‘పోకిరి’, ‘జులాయి’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఇలియానా. దాదాపుగా తెలుగులో అగ్రహీరోలందరితోనూ ఇలియానా నటించింది. కొన్ని విజయాల్ని, ఇంకొన్ని పరాజయాల్నీ ఇలియానా తన ఖాతాలో వేసుకుంది.
రవితేజతో ఇలియానా స్పెషల్ కాంబో
‘కిక్’, ‘ఖతర్నాక్’, ‘దేవుడు చేసిన మనుషులు’.. ఇలా ఇలియానా రవితేజతో సినిమాలు ఎక్కువగానే చేసింది. మళ్ళీ ఇప్పుడు రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటించింది. ‘కిక్’ సినిమాలో బాగా బొద్దుగా కన్పించిన ఇలియానా, ఇప్పుడు అంతకు మించిన బొద్దుతనాన్ని సంతరించుకుంది. యాడెడ్ ఎట్రాక్షన్ అన్నట్లుగా ఈ బ్యూటీ ఇప్పుడు తనకు తాను డబ్బింగ్ కూడా చెప్పుకుంది. తెలుగులో తొలిసారి ఇలియానా ఈ ‘ఫీట్’ సాధించింది. ప్చ్, ఇన్నాళ్ళు పట్టింది తెలుగులో ఇలియానా డబ్బింగ్ చెప్పడానికి అని పెదవి విరిచేవారెంతమందో వున్నార్లెండి. అది వేరే మేటర్.
పాపం అక్షర అలా ఎలా బుక్కయిపోయిందో!
ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేసింది అక్షర హాసన్. అక్క శృతిహాసన్‌లా బోల్డన్ని సినిమాలు ఏమీ చేసెయ్యలేదు. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా సెటిలయ్యేందుకు ప్రయత్నిస్తోన్న అక్షర హాసన్‌కి పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే, ఆమె పర్సనల్ ఫొటోలు లీక్ అవడం. మొదట్లో కామ్‌గా వున్నా, జరిగిన.. జరుగుతున్న డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికి ఆమె స్పందించక తప్పలేదు. తన ఫొటోల్ని లీక్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటానంటోంది ఈ బ్యూటీ. ఇంతకన్నా, ఆ ఫొటోలు తనవి కావని ఆమె ప్రకటించేసి వుంటే బావుండేది.
లీక్డ్ పిక్స్ అందాల భామలకి కొత్తేమీ కాదు
పర్సనల్ పిక్స్ లీక్ అవడం అందాల భామలకు కొత్త కాదు. గతంలోనూ కొందరు హీరోయిన్లు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు. పాపం, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టేసి.. వారిని అసభ్యకరంగా చిత్రీకరించేస్తే? అక్షర హసన్ విషయంలో జరిగింది అది కాదు. ఆమె తీసుకున్న సెల్ఫీలు అవి. ఇంట్లో సరదా కోసం తీసుకుందో, లేదంటే అలా కన్పించేలా ఆమె ఫొటోల్ని మార్ఫింగ్ చేశారో తెలియడంలేదు. ఈ ఉదంతం ఇప్పుడు సినీ పరిశ్రమలో సంచలనమైంది.
ఇది కూడా లైంగిక వేధింపులాంటిదేనా?
అక్షర హాసన్‌కి మద్దతుగా కొందరు మాట్లాడుతున్నారు. ఇవి కూడా లైంగిక వేధింపుల తరహాలోనివేననీ, కాస్టింగ్ కౌచ్ కన్నా దారుణమనీ, సైబర్ క్రైమ్ చట్టాలు మరింత పటిష్టంగా అమలైతే తప్ప, వీటిని అరికట్టలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదీ నిజమే. కానీ, ఇలాంటివాటిని కంట్రోల్ చేయడం కష్టం. క్షణాల్లో పిక్స్ వైరల్ అయిపోయాయి. వందలు, వేలు, లక్షల్లో పోస్ట్‌లు సోషల్ మీడియాలో కన్పించేస్తున్నాయి. కాబట్టి, చట్టాలు కఠినంగా వుండాల్సిందే.