Iman Esmail Imanvi.. ఒకే ఒక్క సినిమా.. అది కూడా, ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. జస్ట్, సినిమా అనౌన్స్‌మెంట్.. లాంఛనంగా ప్రారంభోత్సవం అయ్యిందంతే.
తొలి సినిమాతోనే ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్‌డమ్ ఆమె సొంతమైంది. ఇప్పుడామె పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదేమో.!
అంతా, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుణ్యమే మరి.! ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో తెరంగేట్రం చేస్తున్న ఇమాన్వి గురించే ఇదంతా.

హను రాఘవపూడి సినిమాల్లో హీరోయిన్లంటే.. ఆ కిక్కే వేరప్పా.! చాలాకాలం గుర్తుండిపోతారు అతని సినిమాల్లోని హీరోయిన్లు.!
హీరోయిన్లని చాలా చాలా అందంగా చూపించడంలో హను రాఘవపూడి తనదైన ప్రత్యేకతని ప్రతి సినిమాతోనూ చాటుకుంటుంటాడు.
Iman Esmail Imanvi.. యూ ట్యూబ్ వీడియోల నుంచి..
గతంలో కేతిక శర్మ యూ ట్యూబ్ నుంచే సినిమాల్లోకి వచ్చింది. కేతిక శర్మ మాత్రమే కాదు, చాలామంది అందాల భామలు, సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకుని, వెండితెరపై స్టార్లుగా ఎదిగారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఓ అద్భుతం: శ్రియ శరణ్
ఆ లిస్టులో ఇమాన్వి అలియాస్ ఇమాన్ ఇస్మాయెల్ కూడా చేరిపోయింది. కాకపోతే, ఇమాన్వి ఇంకాస్త స్పెషల్.
డాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా అయిన ఇమాన్వి వీడియోలుకు సోషల్ మీడియాలో బోల్డంత పాపులారిటీ వుంది.
అందం.. అభినయం..
డాన్స్ అంటే, అందమైన అభినయం.. అని చెబుతుంటుంది ఇమాన్వి. ఔను, ఆమె డాన్సులు చూస్తే ఎవరైనా సరే, ఫిదా అయిపోవాల్సిందే.
వెస్ట్రన్ డాన్స్ అయినా, ట్రెడిషనల్ డాన్స్ అయినా.. ఇమాన్వి రూటే సెపరేటు.! మన తెలుగు సినిమా పాటలకి కూడా ఇమాన్వి డాన్సులు చేసి, ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో వదింది.

వేలల్లో కాదు, లక్షల్లో వ్యూస్.. లైక్స్.. ఇమాన్వి వీడియోలకు సొంతం. సోషల్ మీడియా నుంచి వెండి తెరకు ప్రమోట్ అయిన ఇమాన్వికి ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్‌డమ్ అయితే వచ్చేసింది.
నటిగా, ఆ స్టార్‌డమ్‌ని ఇమాన్వి ఎలా నిలబెట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.