India Ayurveda ఇది విన్నారా.? ప్రపంచం మళ్ళీ ఆయుర్వేదం వైపు చూస్తోంది. ఆయుర్వేదమంటే ఏ ఒక్క దేశానికో మాత్రమే సొంతమైనది కాదు. కాకపోతే, భారతదేశానికి ఆయుర్వేదంలో చాలా చాలా ప్రత్యేకత వుంది.
వేప పుల్లతో పల్లు తోముకుంటారా.? నాన్సెన్స్.! ఇది ఒకప్పటి మాట. కానీ, ‘మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా.? వేప సుగుణాలతో కూడిన టూత్ పేస్ట్..’ అంటూ రకరకాల ప్రకటనలు చూస్తున్నాం.
రోజులు మారాయ్.! చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి.. పెద్ద పెద్ద రోగాల వరకు.. ఆయుర్వేదమే అద్భతం.. అని ప్రముఖ వైద్యులు సైతం ఒప్పుకుని తీరాల్సి వస్తోంది.
India Ayurveda కోవిడ్ తెచ్చిన మార్పు..
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమంతా విలవిల్లాడింది. అప్పుడే, సంప్రదాయ మూలికల గురించిన చర్చ జరిగింది. అందునా, భారతదేశంలో సంప్రదాయ వైద్యం గురించి ప్రపంచమంతా చర్చించుకుంది.
‘కషాయం’ గురించి బాగా మాట్లాడుకున్నాం. ఇమ్యూనిటీ పెరగాలంటే చ్యవన్‌ప్రాష్ ఎంత బాగా పనిచేస్తుందో ఇంకోసారి తెలుసుకున్నాం.
ఇప్పుడు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి కూడా ఆయుర్వేదంలోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయంటూ పలు అధ్యయనాలు చెబుతున్నాయట.
ఫిజియోథెరపీ వర్సెస్ యోగా..
యోగాతో మానసిక ప్రశాతతే కాదు.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.. శరీరం ఫిట్‌గా వుంటుంది. ఫిజియోథెరపీ అనేది తరచూ వైద్యులు సూచించే ఓ వైద్య ప్రక్రియ.

ఫిజియోథెరపీ ఎందుకు దండగ.. యోగా వుండగా.. అని వైద్యులే ఒప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.
అలాగని, ఇంగ్లీషు మెడిసిన్‌ని తక్కువ చేయలేం. దేని ప్రత్యేకత దానిదే. ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ వుండవ్. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదమే సరైన మంందు.
ప్రతి ఇంట్లోనూ వుండే పోపులపెట్టెలోనే చాలా ఔషధాల్లాంటివి కనిపిస్తాయ్. అయితే, అతి సర్వత్ర వర్జయేత్. సొంత వైద్యం కూడా అత్యంత ప్రమాదకరం.
Also Read: ఉద్యోగాలు పోతున్నయ్.! ‘సాఫ్ట్’గా పీకి పారేస్తున్నారంతే.!
కోవిడ్ కష్టకాలంలో మద్యం దుకాణాలు బంద్.. బార్లు, రెస్టారెంట్లు బంద్.! ఇంట్లోనే మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకున్నాం.
ఇమ్యూనిటీని పెంచే సహజమైన మార్గాల్ని అన్వేషించాం. మళ్ళీ అంతా మారిపోయింది. తప్పతాగి చిందులేయడం దగ్గర్నుంచి, అడ్డమైన గడ్డీ పొట్టలోకి పంపించేస్తున్నాం.. అంతకు మించిన స్థాయిలో రోగాలు తెచ్చుకుంటున్నాం.
ప్రపంచం మళ్ళీ ఆయుర్వేదం వైపు చూస్తోంది. మంచి ఆహారపుటలవాట్లే మెరుగైన జీవనానికి మేలంటోంది ప్రపంచం. ఆయుర్వేదమే దిక్కు.. అని ప్రపంచం నినదిస్తోన్న వేళ.. మన ఆయుర్వేదానికి మళ్ళీ పాతరోజులొస్తాయేమో.!