India Bharat Name Change.. ఇండియా నుంచి భారత్‌ని వేరు చేయగలమా.? భారత్ నుంచి ఇండియాని వేరు చేయగలమా.?
ఇదెక్కడి కొత్త పంచాయితీ.? కాదు కాదు, ఇది నిజంగానే చెత్త పంచాయితీ.! ‘ఇండియా’ అన్న పేరు తొలగించి, ‘భారత్’ అన్న పేరునే వుంచాలన్న ప్రతిపాదనలు తెరపైకొస్తున్నాయ్.
ప్రతిపాదనలేంటి.? నిర్ణయాలు జరిగిపోతేనూ.! ఔను, ఇదే ప్రచారం జరుగుతోంది అంతటా.!
కొన్ని మీడియా సంస్థలు.. లక్షల సంఖ్యలో.. కోట్ల సంఖ్యలో సోషల్ మీడియా హ్యాండిల్స్.. ఇదే విషయాన్ని చెబుతున్నాయ్.!
India Bharat Name Change.. ఎందుకీ విభజన పంచాయితీ.?
ఇంగ్లీషులో మాత్రమే ఇండియా.. మిగతా అన్ని భాషల్లోనూ ‘భారత్’ అనే పిలుచుకుంటాం.! సో, ఇక్కడ వివాదానికి ఆస్కారమేముంది.? అన్నది ఓ వాదన.
శ్రీలంక.. ఏ భాషలో అయినా అదే పేరు.! ఇంకే దేశానికైనా అంతే.! కానీ, మన దేశానికి సంబంధించి రెండు పేర్లున్నాయ్.
అంతర్జాతీయ సమాజంలో అయితే ‘ఇండియా’.! మన దేశంలో, ఇండియాతోపాటు భారత్ కూడా.! అక్కడే వస్తోంది చిక్కు అంతా.. అన్నది కొందరి వాదన.
మేడిన్ ఇండియా.!
మేడిన్ ఇండియా.. మేక్ ఇన్ ఇండియా.. ఇలా చాలా చెప్పుకుంటున్నాం. టీమిండియా అంటున్నాం.! ఇకపై, ఆ ‘ఇండియా’ వున్న చోట్ల భారత్ అనాలేమో.!
అంతర్జాతీయ సమాజంలో కూడా భారత్ అనే ప్రస్తావన మాత్రమే వుంటుందేమో.! మార్పు తప్పనిసరా.? ఏమో, ఈ విషయమై ఇంతవరకు కేంద్రం అధికారికంగా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.
Also Read: కొత్త ఒక వింత.! ‘బ్రిక్ బిర్యానీ’ తెలుసా మీకు.?
రాజపత్రాల మీద ఇండియా అని మాత్రమే కాదు, భారత్ అని కూడా వుంటుంది.! అలాంటప్పుడు, పేరు మార్చాల్సిన అవసరమే లేదు.!
కాదేదీ వివాదానికి అనర్హం.! ఔను, అదే జరుగుతోందిప్పుడు.! విపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంతో, ఆ ‘ఇండియా’ అన్న పేరుని, దేశానికి లేకుండా చేయాలని మోడీ సర్కారు అనుకుంటోందిట.!
అది నిజమేనా.? ఏమో గానీ.. ఈ రచ్చ కారణంగా.. ప్రపంచం దృష్టిలో పలచనైపోతాం.! మనలో మనమే కొట్టుకు ఛస్తోంటే.. శతృవులకు చులకనైపోకుండా వుంటామా.?