Table of Contents
Indian Budget.. దేశ బడ్జెట్ కావొచ్చు.. రాష్ట్ర బడ్జెట్ కావొచ్చు.. అంకెలు ఘనం.. ఆచరణ శూన్యం.. అన్నది కొత్త మాట కాదు పాత మాటే. బడ్జెట్ అంచనాలు ఎప్పుడూ పెరుగుతూనే వుంటాయ్.!
ఓ సాధారణ మధ్య తరగతి ఇంటి బడ్జెట్టునే తీసుకుంటే.. ప్రతి నెలా పెరిగిపోతూ వుంటుంది.. రాబడితో సంబంధం లేకుండా. పరిస్థితులు అనుకూలించకపోతే అప్పులు చేయాల్సిందే.!
మరి, దేశానికి.. రాష్ట్రానికి.. పరిస్థితులు ఎంత ఘనంగా.. దారుణంగా వుంటాయో కదా బడ్జెట్ విషయంలో.? వుంటాయ్ మరి.!
Indian Budget.. నవ్వుతూ.. హుషారుగా..
బడ్జెట్ ప్రవేశ పెట్టే ఆర్థిక మంత్రులు (కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా..) ఉత్సాహంగా కనిపిస్తారు. వాళ్ళదేం పోతుంది.? రాబడి, అప్పుల లెక్కలు చూపిస్తారు.. అంతా ఘనమేనని చెబుతారు.
రూపాయి వస్తుంది.. రూపాయి పోతుంది.. ఇదే బడ్జెట్ లెక్క.. బడ్జెట్ వస్తుంది.. పోతుంది.. అయితే మనకేంటి.? ఇది సామాన్యుడి అసహనం.
బడ్జెట్ అనగానే స్టాక్ మార్కెట్లు పండగ చేసుకోవడమో.. కంటతడి పెట్టుకోవడమో.. ఇదో పరమ రొటీన్ వ్యవహారం. అదో మాయ.!
Mudra369
నిజానికి, కుటుంబ పెద్ద.. తన కుటుంబ సభ్యుల సాదక బాధకాల్ని ప్రస్తావించినట్లుండదు ఆర్థిక మంత్రుల వ్యవహారం.
సేవ చేయడానికి రాజకీయాల్లోకొచ్చామంటారు.. అద్భుతమైన పాలన అందిస్తున్నామంటారు.. కానీ, లోటు పాట్ల గురించి అస్సలు ప్రజలకు వాస్తవాలు చెప్పరు. ‘పెద్దరికం’ అన్న మాటే వుండదిక్కడ.
స్కీములొస్తాయ్.. వాతలు పడతాయ్..
కొత్త స్కీముల్ని ప్రకటిస్తే.. దాని వల్ల ఖజానాపై భారమంటారు. ఆ పేరు చెప్పి ఇంకో వైపు నుంచి బాదేస్తారు. అలాంటప్పుడు, అసలు భారమన్న ప్రశ్న ఎందుకు వస్తుంది.?
రాష్ట్ ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వాలైనా ప్రచార యావ తగ్గించుకుంటే.. అదే బోల్డంత మిగులు.
కానీ, సొంత డబ్బా కొట్టుకోకపోతే తమ ఉనికి ఎలా తెలుస్తుందనే భయం అధికారంలో వున్నవారికి ఎప్పుడూ వుంటుంది.
వచ్చింది ఇంకో బడ్జెట్టు..
మళ్ళీ వచ్చింది ఇంకో బడ్జెట్టు.. ఇకపై ఆల్ ఈజ్ వెల్.. అంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఇప్పటిదాకా దేశ చరిత్రలో బడ్జెట్ సందర్భంగా, ‘అంతా ఘనమే’ అని చెప్పని ఆర్థిక మంత్రి ఎవరైనా వున్నారా.?
మాటలేమో కోటలు దాటతాయ్.. చేతలేమో గడప కూడా దాటవ్. సామాన్యుడి బతుకు అందుకే మారదు.
దేశంలో పేదల సంఖ్య పెరుగుతూ పోతుంటుంది.. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తుంటాయ్.. ఆ సంక్షేమ పథకాలు సామాన్యుడ్ని నాశనం చేస్తూనే వుంటాయ్.
Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
ట్యాక్స్ పేయర్స్‌కి బతుకుండదు.. పేదోడికి శాశ్వత వెలుగు వుండదు. కానీ, ప్రతిసారీ బడ్జెట్ ఘనమే.!
పిచ్చి కామెడీ ఏంటంటే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీరకట్టు గురించి ‘తెగులు’ మీడియాలో కథనాలు రావడం. ఈ స్థాయికి మీడియా దిగజారిపోయింది. రాజకీయానికి ఊడిగం చేస్తోంది.!
– yeSBee