Indian Woman భారతదేశంలో మహిళల వస్త్ర ధారణపై ఆంక్షలేమీ లేవు. కొన్ని అరబ్ దేశాల్లో మహిళల వస్త్ర ధారణపై ఆంక్షలున్నాయ్. అభ్యంతరకర రీతిలో మహిళలు వస్త్రధారణ చేయకూడదక్కడ. మన దేశంలో అయితే, నో అబ్జక్షన్స్. సంప్రదాయాల్ని పాటించేవాళ్లు ఓ వైపు. పాశ్చాత్య ధోరణిని ప్రదర్శించేవారు ఇంకోవైపు. ఎవరి ఇష్టం వాళ్లది.
నువ్వెందుకిలా కప్పుకుని వచ్చావ్.. అని ఏ మహిళనైనా ప్రశ్నించడం సబబు కాదు. అలాగే ‘నువ్వెందుకిలా అభ్యంతరకరమైన రీతిలో వస్త్రధారణ చేశావ్..’ అని కూడా ప్రశ్నించలేం. ప్రపంచం మెచ్చే గొప్ప సంస్కృతీ సంప్రదాయాలున్న భారతదేశంలో వస్త్రధారణపై ప్రతిసారీ రచ్చ జరుగుతుండడం అస్సలేమాత్రం సబబుగా లేదు.
Indian Woman.. ఏంటీ ముసుగు గొడవ.?
ఇస్లాం సంప్రదాయాల ప్రకారం, మహిళలు ముసుగు ధరిస్తారు. దానిపై వివాదం మొదలైంది. విద్యా సంస్థల్లో ఆ ముసుగు ధరించి రావద్దన్న నిబంధన వివాదాస్పదమైంది. విద్యా సంస్థల్లో యూనిఫామ్ ఎందుకంటే, సమానత్వం కోసం. అందరూ ఒకటే అని చెప్పడం కోసం. కొందరు ముసుగు ధరిస్తే సమానత్వానకి ఇబ్బంది వస్తుందనేది ఓ అభిప్రాయం.
ఇలాంటి అభిప్రాయాలపై చర్చ జరిగితే, తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ, వీటి పేరుతో రాజకీయ రచ్చ జరగడమే దారుణం. బికినీ వేస్తారో, ముసుగు వేసుకుంటారో.. ఆ స్వేచ్ఛ మహిళలకుందని, ఆ స్వేచ్ఛని హరించడం సబబు కాదని దుర్మార్గమైన పోలిక తెచ్చారు కొందరు.
ఇంతకీ తప్పెవరిది.?
ఇంకొందరైతే, నుదుటన పెట్టుకునే తిలకంతో పోలిక తెచ్చారు. మోడ్రన్ అమ్మాయిలు, మోడ్రన్ మహిళలు బొట్టు పెట్టుకోవడాన్నిపక్కన పెట్టేశారు. అలాగని వాళ్లని తప్పు పట్టగలమా.? ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం, ముసుగు కొందరు ధరిస్తారన్నది నిజమే. కానీ, అందరూ అలా చేయడం లేదు కదా. చాలా చాలా సున్నితమైన అంశం ఇది.
Also Read: కొత్త ప్రవచనం: హీరో అంటే అలా వుండకూడదట పుష్పా.!
రాజకీయ నాయకులు సంయమనం పాటించి వివాదం పెద్దది కాకుండా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కానీ, గోతికాడి నక్కల్లా రాజకీయ లబ్ఢి కోసం ఎదురు చూసే సో కాల్డ్ రాజకీయ ప్రముఖులు వివాదాల్ని పెద్దవి చేసి ప్రపంచం దృష్టిలో భారత దేశాన్ని పలుచన చేస్తున్నారు. ఇది అత్యంత హేయం.