ISRO Chandrayaan Politics.. చంద్రయానం అత్యద్భుత విజయాన్ని అందుకుంది.! ‘చంద్రయాన్-3’ మిషన్ సూపర్ సక్సెస్ అయ్యింది.!
జాబిల్లి మీద మన ‘ఇస్రో’ (ISRO) సగర్వంగా సంతకం చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇప్పటిదాకా ఈ భూమ్మీద ఎవరికీ అందని జాబిల్లి తాలూకు దక్షిణ ధృవంపై అడుగు పెట్టింది.
ఇంతటి అత్యద్భుత సందర్భంలో, నిస్సిగ్గు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి భారతావనిలో.!
కోట్లాదిమంది భారతీయులు ఓ వైపు, ‘చంద్రయాన విజయాన్ని’ చూసి మురిసిపోతోంటే, కొందరు మాత్రం, సోషల్ మీడియాలో పడి ఏడుస్తున్నారు నిస్సిగ్గుగా.!
పబ్లిసిటీ స్టంట్లు ఎవరివి.?
ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఘనత అనీ.. కాదు కాదు, ఆయన పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారనీ.. ఇలా ఓ వైపు రచ్చ జరుగుతోంది.
మరో వైపు, తెలుగునాట టీడీపీ అధినేత ‘చంద్ర’బాబు పేరుతో, రాజకీయ రచ్చ చోటు చేసుకుంటోంది చంద్రయానం గురించి.! దేనికిదంతా.? ఎవరి పైత్యమిదంతా.?
ఒక్కరోజు.. ఒకే ఒక్క రోజు.. రాజకీయాలు మాట్లాడకుండా వుండలేరా.? వుండలేరు.! ఆక్సిజన్ పీల్చకపోయినా బతికేస్తారేమోగానీ.. నిస్సిగ్గు రాజకీయాలు చేయకుండా బతకలేరు కొందరు.
‘ఇస్రో’ విజయం రాత్రికి రాత్రి దక్కింది కాదు.! ఏళ్ళ తరబడి జరిగిన పరిశోధనల ఫలితమిది. వందల, వేల మంది నిపుణులు పడ్డ కష్టమిది.!
ISRO Chandrayaan Politics.. ఈ విజయం అందరిదీ..
ఏ ఒక్కరిదో ఈ విజయం కాదు.! ఇది అఖండ భారతావని సాధించిన విజయం.! భారత కీర్తి పతాకాన్ని జాబిల్లిపై రెపరెపలాడించాం.
Also Read: సామాజికోన్మాదం.. సమాజ వినాశనానికి సంకేతం.!
ప్రతి భారతీయుడిదీ ఈ విజయం.! విజయగర్వంతో ఉప్పొంగిపోదాం. ఒకర్నొకరు అభినందించుకుందాం. ఇస్రో శాస్త్రేవేత్తల్ని అభినందిద్దాం. ఈ ఒక్క విషయంలో రాజకీయాలు ప్రస్తావించకుండా వుందాం.!
ప్రస్తుత విజయాల్ని భావితరాలు ఘనంగా చెప్పుకునేలా మన వ్యవహార శైలి వుండాలి తప్ప.. ప్రపంచం దృష్టిలో చులకనయ్యే రాజకీయాలు సబబు కాదు.!
చంద్రయాన్ ప్రాజెక్టు.. రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన పబ్లిసిటీ స్టంట్గా కూడా మారే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే, అంతకన్నా భావదారిద్ర్యం ఇంకోటుండదు.!