Jack Trailer Siddhu Jonnalagadda మాంఛి కామెడీ టైమింగ్ వుంది.! నటన మాత్రమే కాదు, సినిమా కథ రాయగలడు, మంచి డైలాగులూ రాసుకోగలడు. డాన్సులు, యాక్షన్.. వాట్ నాట్.! అన్నీ వున్నాయ్.
సిద్దు జొన్నలగడ్డ.. హై ఓల్టేజ్ ఎనర్జీ ఈ యంగ్ హీరోలో కనిపిస్తుంది. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో యూత్ ఆడియన్స్‌ని కట్టి పడేశాడీ సిద్దు.!
తాజాగా, ‘జాక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిత్ర యూనిట్ లేటెస్టుగా సినిమా ట్రెయిలర్‌ని విడుదల చేసింది.
Jack Trailer Siddhu Jonnalagadda.. సిద్దూ అదరగొట్టేశాడు..
యాజ్ యూజువల్.. సిద్దు జొన్నలగడ్డ తనదైన ఎనర్జీతో ఆకట్టుకుంటాడు ‘జాక్ ట్రైలర్’లో. డైలాగ్ మాడ్యులేషన్, స్క్రీన్ ప్రెజెన్స్.. అన్నీ ఓకే.
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ట్రెయిలర్‌లో కనిపించాడు. హీరోయిన్‌గా నటిించింది ‘బేబీ’ వైష్ణవి చైతన్య. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా బావుంది.
ఓవరాల్‌గా ఓ కమర్షియల్ సినిమాలో ఏమేం వుండాలో, అన్నీ సినిమాలో పొందుపరిచినట్లే కనిపిస్తోంది. పైగా, టెర్రరిస్టుల్ని, వాాళ్ళని వేటాడే టాస్క్ ఫోర్స్.. ఇదంతా కనిపిస్తోంది ట్రెయిలర్‌లో.
తండ్రి పాత్రలో నటించిన నరేష్‌తో సిద్దూకి భలే కామెడీ డైలాగులు పేలినట్లుంది కూడా.
బూతులు బాబాయ్..
అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందాన, ఈ బూతులొకటి. ట్రైలర్‌లో దారుణమైన బూతులే వాడేశారు. ‘మగ ముండాకొడుకులు’ అన్నది అందులో ఓ చిన్న తిట్టు మాత్రమే.
‘మగ ముండాకొడుకులు’ చిన్న తిట్టు అయితే, బూతులు ఏ రేంజ్‌లో వున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయినా, బూతులు లేకుండా సినిమాలు తీయలేరా.? ప్చ్.. కష్టమేనేమో ఈ రోజుల్లో.!
Also Read: షాలిని బట్టలు మార్చుకుంటుంటే గదిలోకి దూరేసిన డైరెక్టరు.!
ఔను, బూతులే తమ భవిష్యత్.. అని సిద్దు లాంటి హీరోలు.. ఓ మూసలో ఇరుక్కుపోతుండడం ఒకింత బాధాకరం. ఇంతకీ, ట్రైలర్‌లోని బూతులకు, థియేటర్లలో కటింగులు పడతాయా.? వేచి చూడాల్సిందే.
అయినా, బొమ్మరిల్లు భాస్కర్ నుంచి ఇలాంటి బూతు డైలాగులేంటి ఖర్మ కాకపోతే.?